Saturday, August 8, 2026 05:31 PM
Saturday, August 8, 2026 05:31 PM

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది. గురువారం కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణపై మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Also Read : నువ్వేమన్నా ఢిల్లీ పోలీసువా..? ఎస్ఐ పై దీప్కే ఆగ్రహం..!

స్థానిక ఎన్నికలు వాయిదా పడతాయన్న ఊహాగానాలకు లోకేష్ చెక్ పెట్టారు. కచ్చితంగా నిర్దేశిత సమయానికే ఎన్నికలు జరుగుతాయని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని తేల్చి చెప్పారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్.. ఇలా అన్ని స్థాయిల్లోనూ కూటమి అభ్యర్థులే విజయకేతనం ఎగురవేసేలా పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో మంత్రులు సమన్వయం చేసుకుంటూ.. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సమాయత్తం చేయాలని స్పష్టం చేశారు.

గత వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకొచ్చిన తీరును జనంలోకి బలంగా తీసుకెళ్లాలని లోకేష్ మంత్రులకు సూచించారు. ప్రచారంలో భాగంగా నాయకులు ప్రతి ఇంటి తలుపు తట్టాలని, కనీసం మూడు నిమిషాల పాటు అక్కడి వారితో మాట్లాడాలని నిర్దేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజలతో మమేకం కావడమే గెలుపుకు అసలైన మంత్రమని ఆయన నొక్కి చెప్పారు.

Also Read : ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌ ప్రక్షాళన..? ఆ ఐదుగురు మంత్రులపై వేటు పక్కా..?

సీఎం చంద్రబాబు నాయుడి విజన్, పారదర్శక పాలన..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చొరవ స్థానిక ఎన్నికల్లో కూటమికి తిరుగులేని ప్రజాదరణను తెచ్చిపెడతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ ఫలాలను పాజిటివ్ దృక్పథంతో ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళితే.. స్థానిక సంస్థల్లో ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని ఈ భేటీలో పాల్గొన్న మంత్రులు సైతం ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

ఈవీఎంలకు వ్యతిరేకంగా కాక్రోచ్...

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్...

పోల్స్