మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే మరియు ఆయన నివాసంలో భద్రత కోసం మోహరించిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సురేష్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వాలూజ్ ఎమ్ఐడీసీ పరిధిలోని తన ఇంటికి వచ్చే సందర్శకులను లోపలికి రానివ్వకుండా సదరు ఎస్సై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, తనను కలవడానికి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తున్నాడని అభిజీత్ దీప్కే తీవ్రంగా మండిపడ్డారు. తన అనుమతితోనే ఇల్లు దాటి లోపలికి వస్తున్న జనాన్ని అడ్డుకోవడానికి పోలీసులకు ఉన్న అధికారమేంటని ఆయన ప్రశ్నించారు.
Also Read : లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్.. బన్నీకి విలన్ గా బాలీవుడ్ స్టార్..?
ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు, అలాగే సీనియర్ పోలీస్ అధికారితో అభిజీత్ దీప్కే ఫోన్ లో మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. “నా ఇంటికి వచ్చే వాళ్లను నువ్వు అడ్డుకోవడమేంటి..? మీరేమన్నా ఢిల్లీ పోలీసుల్లా ప్రవర్తిస్తున్నారా..? నన్ను ఎవరు కలవాలో, ఎవరు కలవకూడదో చెప్పడానికి మీరెవరు..?” అంటూ సివిల్ డ్రెస్ లో ఉన్న సదరు ఎస్సైపై దీప్కే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, “దయచేసి నా ఇంటి ప్రాంగణం నుండి ఇప్పుడే బయటకు వెళ్ళిపోండి, మీ భద్రత నాకు అవసరం లేదు” అంటూ సదరు అధికారిని అక్కడికక్కడే సాగనంపారు.
Also Read : ఏపీలో త్వరలోనే క్యాబినెట్ ప్రక్షాళన..? ఆ ఐదుగురు మంత్రులపై వేటు పక్కా..?
మరోవైపు ఈ వ్యవహారం వెనుక ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఉందనే అనుమానాలను అభిజీత్ దీప్కే వ్యక్తం చేశారు. తన ఇంటి పరిసరాల్లో రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కి చెందిన సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. అక్కడ నిఘా వేసిన ఒక సీఐడీ అధికారిక ఫోన్ లో హిట్ స్ప్రే అనే పేరుతో ఉన్న సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అయి ఉందని, దాని ద్వారానే తన కదలికలపై నివేదికలు పంపుతున్నట్లు స్థానిక జర్నలిస్టులు గుర్తించారని దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇబ్బంది పెట్టడానికే కావాలనే ఇలాంటి దురుసు అధికారులను పంపించారని, సదరు ఎస్సై సురేష్‌ను వెంటనే ఆ బాధ్యతల నుండి తొలగించాలని ఆయన ఉన్నతాధికారులను ఫోన్ లో డిమాండ్ చేశారు.

