Wednesday, September 23, 2026 12:42 AM
Wednesday, September 23, 2026 12:42 AM

లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్.. బన్నీకి విలన్‌ గా బాలీవుడ్ స్టార్..?

పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తుండగా, దాని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ‘AA23’ సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ విజువల్ వండర్లో ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను ఎంపిక చేయనున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి.

Also Read : ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌ ప్రక్షాళన..? ఆ ఐదుగురు మంత్రులపై వేటు పక్కా..?

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథల్లో విలన్లకు ఉండే ప్రాధాన్యత, వారి క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్టర్ లో విజయ్ సేతుపతి, విక్రమ్ లో సూర్య లాంటి స్టార్లను ఇంటెన్స్ షేడ్స్‌లో చూపించిన శైలిలోనే, బన్నీ సినిమా కోసం కూడా ఒక పవర్‌ఫుల్ డార్క్ పాత్రను డిజైన్ చేశారట. కబీర్ సింగ్, ఫర్జీ వంటి ప్రాజెక్ట్లతో నెగెటివ్ షేడ్స్ లో అదరగొట్టిన షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తే, హీరోతో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో ఉంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే గనుక ఉత్తరాది మార్కెట్‌లో ఈ సినిమా రేంజ్ మరియు బిజినెస్ అంచనాలకు అందకుండా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : చైనా కుతంత్రాలకు షాక్ ఇచ్చిన భారత్..!

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రంలో అసలు హీరోయిన్ పాత్రే లేకుండా కేవలం పవర్ ఫుల్ కాన్ఫ్లిక్ట్ డ్రామాపైనే దర్శకుడు పూర్తిగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ బాణీలు కడుతున్న ఈ సినిమా మేకింగ్‌ను విదేశీ లొకేషన్లు, భారీ సెట్లలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ యూనిక్ బాడీ లాంగ్వేజ్, లోకేష్ రా యాక్షన్ మేకింగ్, దానికి తోడు విలన్ గా షాహిద్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల రచ్చ సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వైరల్ న్యూస్‌పై చిత్రబృందం అధికారిక స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

పోల్స్