Friday, August 7, 2026 07:15 PM
Friday, August 7, 2026 07:15 PM

జనసేన జెండా కోసం పవన్ మాస్టర్ ప్లాన్..!

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ బలోపేతంపై తగినంత దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఎదుర్కొన్న పవన్.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేసే దిశగా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ శక్తిని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. వార్డులు, డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వానికి ఆదేశాలు ఇచ్చారు.

Also Read : ఎలా చెబితే అర్థం చేసుకుంటారు మీరు..!

పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఎన్నికల్లో భారీగా పోటీ చేయాలనే లక్ష్యంతో విస్తృత కసరత్తు జరుగుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్రస్థాయి నాయకత్వాన్ని మరింత ఉత్సాహపరచాలని పవన్ భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల్లో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది.

Also Read : నేను సీఎంతోనే ఉంటా.. విడాకుల కేసులో ట్విస్ట్..!

ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై చూపుతున్న చురుకుదనంపై టీడీపీలో కూడా జోరుగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎక్కువ స్థానాలు కోరే అవకాశం ఉందన్న అంచనాలు టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధమైన జనసేన.. స్థానిక ఎన్నికల్లో మాత్రం అదే విధానాన్ని కొనసాగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో తమకంటూ బలమైన నాయకత్వం ఉందని నిరూపించగలిగితే, భవిష్యత్ సార్వత్రిక ఎన్నికల్లో మరింత ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహంలో కీలక మెట్టుగా మార్చేందుకు ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని భావిస్తున్నారు. కూటమి భాగస్వామ్య రాజకీయాల్లో ఈ వ్యూహం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

ఈవీఎంలకు వ్యతిరేకంగా కాక్రోచ్...

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్...

బెజవాడ మేయర్ పీఠంపై...

ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం...

ఎలా చెబితే అర్థం...

సాధారణంగా ఒక నానుడి ఉంది. అదేమిటంటే.....

ఇంట్రస్టింగ్ గా సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం...

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పోల్స్