భారత చలనచిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ రామాయణ సరికొత్త రికార్డులకు తెరతీస్తోంది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం.. కేవలం పబ్లిసిటీ ప్రమోషన్ల కోసమే ఏకంగా రూ. 375 కోట్లు ఖర్చు చేయబోతుండటం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరుస్తోంది. సాధారణంగా భారత సినిమాలకు ప్రచారం కోసం కొన్ని పదుల కోట్లు ఖర్చు చేయడం చూస్తుంటాం.
Also Read : మరో మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్దం..?
కానీ గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ హాలీవుడ్ బిగ్ ప్రాజెక్టుల సరసన ఈ చిత్రాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో మేకర్స్ ఈ స్థాయిలో భారీ బడ్జెట్ ను కేటాయించారు. ఈ మైండ్ బ్లాకింగ్ పబ్లిసిటీ బడ్జెట్ లో భాగంగా విదేశాల్లో ప్రమోషన్లు, పంపిణీ బాధ్యతలను స్వీకరించిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సోనీ పిక్చర్స్.. కేవలం అంతర్జాతీయ మార్కెట్ లోనే ప్రచారం కోసం రూ. 235 కోట్లను వెచ్చించనుంది. ఇక భారత మార్కెట్లో ప్రమోషన్ల కోసం చిత్ర నిర్మాతలు మరో రూ. 140 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు.
Also Read : సీజేపి దెబ్బ బీజేపి కంటే కాంగ్రెస్ కే ఎక్కువా..?
హాలీవుడ్ స్థాయి వేదికలపై అంతర్జాతీయ ఆడియన్స్ ముందుకు ఈ ప్రాజెక్ట్ ను మరింత గ్రాండ్ గా తీసుకెళ్లేందుకే ఈ పబ్లిసిటీ స్ట్రాటజీని మార్చారని, అందుకే సోనీ పిక్చర్స్ తో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం కారణంగానే జూలై 24న విడుదల కావాల్సిన అధికారిక ట్రైలర్ ను మేకర్స్ తాత్కాలికంగా వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పీక్స్ కు చేరాయి.

