Sunday, September 13, 2026 03:34 PM
Sunday, September 13, 2026 03:34 PM

కేంద్రానికి సీజేపి మరో డెడ్ లైన్..!

దేశవ్యాప్తంగా వివిధ ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్‌దాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో నిరసనకారులపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటను పక్కనబెట్టి కేంద్రం వెనకడుగు వేయడం సరికాదని హితవు పలికారు.

Also Read : జనాల డబ్బులతోనే గెలిచా.. మాజీ సీఎం ప్రకటన..!

కేంద్రం ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నిరసనకారులపై కొత్తగా కేసులు నమోదు చేస్తున్నట్లు తమకు స్పష్టమైన సమాచారం అందుతోందని సౌరవ్‌ దాస్ వెల్లడించారు. ఈ విషయంలో తాము కేంద్ర మంత్రులను నిలదీస్తున్నామని, గతంలో వారు చేసిన అధికారిక ప్రకటనలను, ఇచ్చిన పక్కా హామీలను మరోసారి గుర్తు చేస్తున్నామని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిపై ఇంకా చట్టపరమైన చర్యలకు పూనుకోవడం దారుణమన్నారు.

Also Read : హైడ్రా కమిషనర్ ను తొలగించండి: హైకోర్ట్ సంచలనం

కేసుల ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం లక్షలాది మంది విద్యార్థులను, యువతను తీవ్రంగా వంచించడమేనని, ఇది ముమ్మాటికీ నమ్మకద్రోహమే అవుతుందని ఆయన ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన అన్ని రకాల కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్తంగా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని సౌరవ్‌ దాస్ హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్