భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సుదీర్ఘ కాలంగా రారాజుగా వెలుగుతున్న మారుతి సుజుకి బ్రెజ్జా సరికొత్త అవతారంలో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ప్రత్యర్థి కార్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా సరికొత్త లుక్, సరికొత్త ఇంజిన్ మరియు అధునాతన సాంకేతికతతో 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్ మోడల్ ను సంస్థ లాంచ్ చేసింది. ఈ సరికొత్త టర్బో వేరియంట్ ప్రారంభ ధరను రూ. 7.40 లక్షలుగా మారుతి సంస్థ నిర్ణయించింది.
Also Read : 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ.. అసెంబ్లీలో తీర్మానం..!
ఈ 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్ లో ప్రధాన ఆకర్షణ దీని హుడ్ కింద అమర్చిన సరికొత్త టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అనుసంధానించబడి, రోడ్లపై అత్యుత్తమ టార్క్ ను, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. హైవేలపై లాంగ్ క్రూజింగ్ మరింత సులువుగా సాగేలా ఈ ఇంజిన్ ఎన్‌వీహెచ్ కంట్రోల్స్ ఇతర కార్ల కంటే అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే టర్బో వేరియంట్ లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ లేకపోవడం ఒక చిన్న లోటుగా చెప్పుకోవచ్చు.
Also Read : ఎందుకమ్మా ఇలా చేశావు.. చలించిన చంద్రబాబు..!
కారు బాహ్య రూపంలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, స్పోర్టీ లుక్ కోసం సరికొత్త గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రెడ్ యాక్సెంట్లను జోడించారు. కారు ఇంటీరియర్ క్యాబిన్ ను మరింత లగ్జరీగా మార్చారు. ఇందులో పెద్దదైన 10.1-ఇంచుల స్మార్ట్ ప్లే ప్రో ఎక్స్ టచ్ స్క్రీన్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, మరియు పిఎమ్ 2.5 ఫిల్టర్ గల ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు. భద్రత పరంగా ఈ కొత్త బ్రెజ్జా 5-స్టార్ భారత్ ఎన్‌సిఎపి రేటింగ్ తో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లయిన బ్లైండ్-స్పాట్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్‌లను ఇందులో పొందుపరిచారు. మొత్తం మీద, అటు మైలేజ్, ఇటు అదిరిపోయే టెక్నాలజీతో ఫ్యామిలీస్ కోసం ఒక పర్ ఫెక్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా సరికొత్త మారుతి బ్రెజ్జా నిలవనుంది.

