Saturday, July 25, 2026 08:56 PM
Saturday, July 25, 2026 08:56 PM

‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ప్యూచర్ ప్లాన్ ఏంటి..?

రాజకీయాల్లో పార్టీల పుట్టుక కొత్తేమీ కాదు. కోట్ల రూపాయల నిధులు, సుదీర్ఘ మేధోమథనం, నాయకుల అండదండలతో ఆవిర్భవించే సాంప్రదాయ పార్టీలను చూస్తూనే ఉన్నాం. కానీ, ఎటువంటి రాజకీయ మూలాలు లేకుండా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యకు నిరసనగా వ్యంగ్యంతో ఆవిర్భవించిన ఒక సంస్థ.. నేడు ఏకంగా దేశ రాజధానినే కుదిపేస్తోందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ సంస్థే ‘కాక్రోచ్ జనతా పార్టీ’. కేవలం రెండు నెలల వ్యవధిలోనే లక్షలాది మంది యువతను, విద్యార్థులను ఏకం చేస్తూ పార్లమెంట్ గడప వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లిన తీరు, భారతీయ ప్రజాస్వామ్యంలో డిజిటల్ ఉద్యమాల్లో కొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది.

Also Read : టీడీపీకి బోండా ఉమా గుడ్‌బై..?

ఈ ఉద్యమ పునాది వెనుక యువత నిరాశ, నిస్పృహలు దాగి ఉన్నాయి. ఉన్నత విద్యా వ్యవస్థల్లో జరుగుతున్న బోగస్ డిగ్రీల వ్యవహారంపై స్పందిస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ‘పరాన్నజీవులు, బొద్దింకలు’ అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే దేశంలో నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థల నిర్లక్ష్యంతో నలిగిపోతున్న యువత ఆ వ్యాఖ్యను తమ ఆత్మగౌరవ సమస్యగా తీసుకుంది. ఆ ఆక్రోశానికి ప్రతీకగా అమెరికా నుంచి వచ్చిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే ‘అవును.. మేము బొద్దింకలమే! అన్ని బొద్దింకలు ఏకమైతే ఏమవుతుందో చూపిస్తాం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి శ్రీకారం చుట్టారు.

Also Read : ప్రభుత్వ బడుల్లో ‘NO ADMISSION’.. లోకేష్ విజన్ ఎఫెక్ట్

వ్యవస్థలు తమను లెక్క చేయనప్పుడు, ఆ వ్యవస్థల కళ్లల్లో నలుసులా మారాలనే ట్యాగ్ లైన్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం.. డిజిటల్ వేదికలపై అగ్నిజ్వాలలా వ్యాపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 కోట్లకు పైగా, ఎక్స్.. ట్విట్టర్‌లో 2.6 కోట్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకోవడం ఈ ఉద్యమానికి లభించిన ప్రజామోదానికి నిదర్శనం. చివరికి జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం సాంకేతిక ఆంక్షలు విధించినా, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తమ గొంతును గెలిపించుకోవడం వీరి పోరాట పటిమకు తొలి విజయం. సామాజిక మాధ్యమాలకే పరిమితమయ్యే ‘కీబోర్డ్ వారియర్స్’ కాదని ఈ సంస్థ నిరూపించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీల నేపథ్యంలో సీజేపీ నేరుగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టింది.

Also Read : బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ వంటి ఉద్యమకారుల మద్దతు లభించడం, ఆయన చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష ఉద్యమానికి నైతిక బలాన్ని ఇచ్చాయి. జూలై 20న నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. మూడంచెల భద్రత, నిషేధాజ్ఞలను దాటుకుని వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు ఢిల్లీకి చేరుకోవడం సాధారణ విషయం కాదు. పటిష్టమైన పోలీసు బలగాల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాల మధ్య ఢిల్లీ రణరంగాన్ని తలపించినా, యువత చూపిన పట్టుదల కేంద్ర ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వయంగా సీజేపీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించడం, వారి డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పడం ఈ ప్రజా పోరాటం సాధించిన విజయం.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, బాధితులకు రూ. 1 కోటి పరిహారం, కేసుల ఉపసంహరణ వంటి స్పష్టమైన ఎజెండాతో ముందుకు సాగుతున్న సీజేపీ, కేవలం ఒక తాత్కాలిక నిరసన కాదని స్పష్టమవుతోంది. ‘ప్రజలను, ముఖ్యంగా యువతను తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుంది?’ అనే ప్రశ్నకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సజీవ సమాధానం. ఈ పరిణామాలు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, యువత భవిష్యత్తు వంటి ప్రధాన సమస్యలను పక్కనబెట్టి, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే, రేపటి తరం సొంతంగా తమ వేదికలను నిర్మించుకుంటుందని ఈ ఘటన రుజువు చేసింది. రాజకీయం అంటే కేవలం జెండాలు అజెండాలు మాత్రమే కాదని అది భావజాలం, బాధితుల ఐక్యత అని సీజేపీ నిరూపించింది. వ్యవస్థల మేల్కొలుపులా సాగుతున్న ఈ బొద్దింకల గర్జన రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్...

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్...

సీమకు మరో బంపర్...

రాయలసీమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్...

కోడలిపై జోగి రమేష్‌...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా...

పోల్స్