Sunday, September 13, 2026 08:17 PM
Sunday, September 13, 2026 08:17 PM

టాక్సిక్ – పెద్దలకు మాత్రమేనా.? నిర్మాత ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

కేజీఎఫ్ ఫ్రాంచైజీతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్కేల్‌ లో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రం కేవలం పెద్దలకు మాత్రమేనని చిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయమై తాము టైటిల్‌ లోనే ‘ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే ట్యాగ్‌ లైన్ ద్వారా ముందే క్లారిటీ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

Also Read : రా ఎన్టీఆర్ వివాదం.. సేవ వెనుక అసలు కథేంటి..?

ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్, టీజర్లు, మరియు పాటలను గమనిస్తే ఇందులో భారీ యాక్షన్‌ తో పాటు బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా తబాహీ పాటలో యష్ – కియారా అద్వానీ రొమాన్స్, మనసాగదే సాంగ్ లో వచ్చే బాత్ టబ్ సీన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమాను ప్రత్యేకంగా ఆ ఏజ్ గ్రూప్ వారిని దృష్టిలో ఉంచుకునే ప్రజెంటింగ్, స్టైలింగ్ చేశామని వివరించారు.

Also Read : ఉండి వైసీపీలో మంటలు.. జగన్ వైఖరితో చిచ్చు..!

చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు విడుదల చేసిన మూడు టీజర్లు, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని నిర్మాత వెంకట్ కె. నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. మొదటి టీజర్‌లో క్రియేటివిటీని, రెండో దాంట్లో సినిమా స్థాయిని, మూడో టీజర్‌లో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్లను పరిచయం చేస్తూ విభిన్నమైన శైలిలో ప్రమోషన్లు నిర్వహించామని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ ను ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను అందించారు. కాగా ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ విభిన్న యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్