భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ లైనప్ తో మార్కెట్లోకి దూసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ గతంలో ప్రదర్శించిన నాలుగు కాన్సెప్ట్ మోడళ్లలో.. విజన్ S, విజన్ X, విజన్ SXT ఒకటైన మహీంద్రా విజన్ T డిజైన్ ను తాజాగా దేశంలో పేటెంట్ పొందింది. ఈ పేటెంట్ ఫైలింగ్ బయటకు రావడంతో, మహీంద్రా ప్రియులలో దీని ప్రొడక్షన్ వెర్షన్ పై భారీ అంచనాలు మరియు ఆసక్తి మొదలయ్యాయి. లీకైన పేటెంట్ చిత్రాల ప్రకారం.. ఈ సరికొత్త వాహనం ఒక కాంపాక్ట్, బాక్సీ స్టాన్స్ మరియు అప్‌రైట్ ప్రొపోర్షన్స్‌తో కూడిన ఎస్‌యూవీలా కనిపిస్తోంది.
Also Read : ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీకి లైన్ క్లియర్..?
ఇది ప్రస్తుతం మహీంద్రా అనుసరిస్తున్న రగ్గడ్ మరియు పవర్ ఫుల్ రోడ్ ప్రెజెన్స్ డిజైన్ శైలికి అద్దం పడుతోంది. ఈ కారుకు ఫ్లాట్ బోనెట్ తో పాటు ప్రముఖంగా కనిపించే వీల్ ఆర్చెస్ ఉన్నాయి. సింపుల్ కానీ పవర్ ఫుల్ గా కనిపించే ఫ్రంట్ గ్రిల్, కాన్సెప్ట్ మోడల్ ను తలపించే హెడ్‌లైట్లు మరియు బంపర్ ఏరియా ఈ వాహనానికి మరింత స్పోర్టీ లుక్ ను ఇస్తున్నాయి. అర్బన్ క్రాస్ ఓవర్ లాగా కాకుండా, కఠినమైన ఆఫ్-రోడ్ క్యారెక్టర్ ను ప్రతిబింబించేలా దీని వీల్స్, టైర్ల డిజైన్ ను రూపొందించడం విశేషం.
Also Read : పులివెందులకి జగన్ గుడ్ బై..?
సాధారణంగా ఏదైనా ఒక డిజైన్‌కు పేటెంట్ లభించిన వెంటనే ఆ వాహనం మార్కెట్లోకి వచ్చేస్తుందని చెప్పలేము. కానీ సదరు కాన్సెప్ట్ లేదా ప్రోటోటైప్ మోడల్.. తదుపరి డెవలప్‌మెంట్ దశకు చేరుకుందనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మహీంద్రా సంస్థ కాన్సెప్ట్ మోడల్ లో చూపించిన ప్రత్యేకమైన స్టైలింగ్‌ను పెద్దగా మార్చకుండా, దాదాపు అదే లుక్ తో ప్రొడక్షన్ వెర్షన్ ను కూడా షోరూమ్ లలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ పేటెంట్ డిజైన్ ద్వారా అర్థమవుతోంది. మహీంద్రా నెక్స్ట్ జనరేషన్ ఎస్‌యూవీ ఫ్యామిలీలో ఇదొక అత్యంత ప్రత్యేకమైన వాహనంగా నిలిచే అవకాశం ఉంది. బాక్సీ స్టాన్స్ మరియు రగ్గడ్ లుక్ ఇష్టపడే కస్టమర్లను ఈ మోడల్ ఎక్కువగా ఆకట్టుకోనుంది. అయితే దీనికి సంబంధించిన ఇంజన్ ఆప్షన్లు, ఫీచర్లు మరియు లాంచ్ తేదీ వంటి సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా గోప్యంగానే ఉంచింది.

