Sunday, September 13, 2026 10:58 PM
Sunday, September 13, 2026 10:58 PM

లొంగే ప్రసక్తే లేదు.. ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన..!

మిడిల్ ఈస్ట్ లో రోజురోజుకు ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తూ అక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజస్కియాన్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో వాతావరణంలో ఉందని ఆయన సంచలన ప్రకటన చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఇరాన్ ఏమాత్రం రాజీ పడబోదని అధ్యక్షుడు పెజస్కియాన్ స్పష్టం చేశారు.

Also Read : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఆర్ఎస్‌కే..!

తమ దేశ హక్కులు, ప్రయోజనాలను రక్షించుకునేందుకు ఎంతటి నిర్ణయానికైనా సిద్ధమని ఉద్ఘాటించారు. బాహ్య శక్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు, రాజకీయ నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. దేశ శ్రేయస్సు కోసం అంతా విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి ప్రజల మద్దతు, నాయకుల ఏకాభిప్రాయం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : పట్టు వదలని కాక్రోచ్ లు.. నేడు కూడా..!

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతతను పాటించడం అవసరమని పెజస్కియాన్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఉమ్మడి నిర్ణయాలు మాత్రమే ఇప్పుడు ఇరాన్‌ను సరైన మార్గంలో నడిపిస్తాయని ఆయన వెల్లడించారు. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ఈ వేగవంతమైన పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. కాగా గత పది రోజుల నుంచి అమెరికా.. ఇరాన్ పై దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్