సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్.. సాయి పల్లవి ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న రామాయణం: పార్ట్ 1 చిత్రంలో ఆమె సీతగా కనిపించనుంది. వెండితెరపై ఎంత గ్లామరస్ గా కనిపించినా, నిజజీవితంలో మాత్రం సాయి పల్లవి చాలా సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే హంగులు, ఆడంబరాలకు దూరంగా ఉండే ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా కోయంబత్తూరులో ఆమె ఇల్లు ఉంది.
Also Read : కాదంబరి జెత్వాని కేసులో సంచలన నిజాలు..!
నోబ్రోకర్ రిపోర్ట్ ప్రకారం, కోయంబత్తూరులో ఉన్న సాయి పల్లవి ఫ్యామిలీ హోమ్ విలువ సుమారు రూ. 5 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఇల్లు ఎలాంటి మోడ్రన్ హంగులు, జిగేల్ మనే ఇంటీరియర్స్ తో కాకుండా, కేవలం సాంప్రదాయక శైలిలో, కుటుంబ విలువలకి ప్రాధాన్యతనిస్తూ నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, క్లాసిక్ లుక్ ఇచ్చే చెక్క ఫర్నిచర్ మరియు సహజసిద్ధమైన రాతి ఫ్లోరింగ్ తో ఈ ఇల్లు ఎంతో హాయిగా, అందంగా ఉంటుంది. ఈ ఇంట్లోని లివింగ్ రూమ్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా విశాలంగా డిజైన్ చేశారు.
Also Read : హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా జూబ్లీహిల్స్.. ఆపరేషన్ థండర్ బోల్ట్ తో చుక్కలు..!
బెడ్ రూమ్స్ కూడా సహజమైన వెలుతురు వచ్చేలా, ఎలాంటి హడావుడి లేకుండా లేత రంగులతో, ప్రశాంతతను ఇచ్చేలా ఉంటాయి. ఇక ఇంట్లో అన్నిటికంటే ప్రత్యేకమైనది సాంప్రదాయ చెక్క మందిరంతో అలరారే పూజా గది. ఇత్తడి దీపాలు, తాజా పూలతో నిండి ఉండే ఈ దైవిక ప్రదేశం సాయి పల్లవి కుటుంబానికి సంస్కృతి, ఆధ్యాత్మికతపై ఉన్న గౌరవాన్ని చాటిచెబుతుంది. ఈ ఇంటికి ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ప్రకృతితో ఉన్న అనుబంధం. ఇంటి వంటగది గ్రానైట్ కౌంటర్ టాప్ లు మరియు చక్కటి స్టోరేజ్ క్యాబినెట్లతో ప్రాక్టికల్‌గా ఉంటుంది. అలాగే ఇంటి బాల్కనీలు, చుట్టుపక్కల ప్రాంతాలు నిండుగా ఉండే పచ్చదనంతో, ఒక అందమైన తోటలా కనిపిస్తాయి. షూటింగ్స్ నుండి విరామం దొరికినప్పుడు సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి ఇక్కడే ఉదయం వేళల్లో టీ తాగుతూ ప్రశాంతమైన సమయాన్ని గడుపుతుంది.

