ఏడు పదుల వయసులో కూడా తగ్గేదేలే అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. నవతరం హీరోలతో ఇప్పటికీ పోటీ పడుతూ తన రేంజ్ ఎనర్జీతో సరికొత్త రికార్డులకు రెడీ అవుతున్నారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లో మెగాస్టార్ డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అంతా అవాక్కయిందట. మెగాస్టార్ చిరంజీవి అంటేనే టాలీవుడ్‌కు ఒక బెంచ్ మార్క్. వయసు కేవలం అంకె మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న ‘మెగా 158’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది.
Also Read : మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. కీలక ఆదేశాలు..!
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్ పెడుతున్న ఎఫర్ట్స్ చూస్తుంటే.. ఈసారి పూనకాలు గ్యారెంటీ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా జరిగిన భారీ యాక్షన్ షెడ్యూల్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి షూటింగ్ కోసం తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి కఠినమైన వర్కవుట్స్ పూర్తి చేశారు. ఉదయం 9 గంటలకు పక్కా ప్లానింగ్‌తో లొకేషన్‌లో అడుగుపెట్టి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా వర్క్ చేశారు. మధ్యాహ్నం కేవలం ఒక గంట లంచ్ బ్రేక్ మినహా.. దాదాపు 12 గంటల పాటు విరామం లేకుండా కెమెరా ముందుకు రావడం ఆయన క్రమశిక్షణకు అద్దం పడుతోంది. ఈ రేంజ్ డెడికేషన్ చూసి సెట్‌లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారట.
ఈ షెడ్యూల్‌లో అత్యంత కఠినమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. వర్షంలో సాగే ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను టాలీవుడ్ టాప్ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అద్భుతంగా కంపోజ్ చేశారు. రోజంతా తడుస్తూ.. ఒళ్లు హూనం చేసుకునేలా సాగిన యాక్షన్ స్టంట్‌లో చిరంజీవి డూప్ కూడా వాడకుండా స్వయంగా పాల్గొన్నారట. సినిమా మొత్తానికి ఈ రెయిన్ ఫైట్ విజువల్స్ మేజర్ హైలైట్‌గా ఉంటాయని.. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు బాబీ మెగాస్టార్ ఇమేజ్‌కు తగినట్లుగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేశారని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్. షూటింగ్ స్పాట్‌లో మెగాస్టార్ చూపిస్తున్న అంకితభావంపై మూవీ టీమ్ ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది.
Also Read : అన్నపై చెల్లి ప్రత్యక్ష ఉద్యమం.. వార్ స్టార్ట్..!
చిరంజీవి నిరంతర శ్రమ, సినిమాపై ఉన్న ప్యాషన్ కారణంగానే ఆయన ఇండియన్ సినిమాకు మెగాస్టార్ అయ్యారంటూ మూవీ టీమ్ ట్వీట్ చేయడం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్, టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగాస్టార్‌తో నటించే సీన్స్ సినిమా కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పైన అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమాకు మరో ప్రధాన బలం సంగీత దర్శకుడు తమన్. మెగాస్టార్ మార్క్ మాస్ బీట్స్, ఎలివేషన్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. టైటిల్ గ్లింప్స్‌లోనే మెగాస్టార్ చిరంజీవి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, సినిమా స్కేల్ ఏంటనేది చూపించేందుకు టీమ్ రెడీ అవుతోంది.

