Tuesday, August 25, 2026 11:53 AM
Tuesday, August 25, 2026 11:53 AM

మావిగన్ సరే.. మరి విశాఖ మాటేమిటి..?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అమరావతిలో వైసీపీ నేతల పర్యటనను రైతులు అడ్డుకోవడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల తరఫున నిలబడేందుకు వచ్చిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారని.. తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే తమపై రాళ్ల దాడి జరిగిందని.. వైసీపీ నేతల కార్ల అద్దాలు పగలగొట్టారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తమను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు జగన్.

Also Read : లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.. వేడి తట్టుకోలేకే జగన్ హైదరాబాద్ పర్యటన..?

ఏపీ రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తమ అభిప్రాయం స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని జగన్ ప్రకటించారు. మచిలీపట్నంలో పోర్టు ఉందని, విజయవాడలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఉందని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రైల్వే జంక్షన్‌లు అందుబాటులో ఉన్నాయని.. వీటిని కొత్తగా కట్టాల్సిన అవసరం లేదన్నారు. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు కలిపి మావిగన్ పేరుతో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని.. ఇది గ్రోత్ ఇంజన్ అని తెలిపారు.

నిజానికి అమరావతిపై జగన్ ఇలా ప్రకటించడం ఇది తొలిసారి కాదు. 2015లో ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు అప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు లేదా ఉమ్మడి ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో అమరావతిని కేవలం ఒక కులానికి ఆపాదించారు. ఇక అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఆ ప్రాంతంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో మాట మార్చారు. అమరావతి రాజధాని అని ప్రకటించారు. తాను ఇక్కడే ఉంటా.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అని ప్రకటించారు.

Also Read : స్కూల్స్ లో ఎలక్షన్స్.. విజయ్ సంచలన నిర్ణయం..!

2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత సరిగ్గా ఆరు నెలలకే మాట మార్చేశారు. అమరావతి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. కాబట్టి రాష్ట్రానికి 3 రాజధానులు కావాలన్నారు. అందులో విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు‌ను న్యాయ రాజధానిగా చేస్తానంటూ ప్రకటించారు. దీంతో ఆహా, ఓహో అంటూ వైసీపీ నేతలు తెగ సంబరాలు చేసుకున్నారు. అలాగే విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకుంటున్నారంటూ.. ఎయిర్ పోర్టులోనే ఆపేసి.. రాళ్ల దాడి చేశారు. జగన్ కూడా.. విశాఖ నుంచే పరిపాలన అంటూ ప్రకటించారు. అలాగే తన అధికారిక నివాసం కోసమంటూ రుషికొండ‌ను తవ్వేసి.. అక్కడ దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసి రెండు ప్యాలెస్‌లు నిర్మించాడు. ఇక ఇక్కడ నుంచే.. అని 2024 ఎన్నికల్లో గొప్పగా చెప్పారు కూడా.

మూడు రాజధానుల ప్రకటన వైసీపీని అధఃపాతాళానికి పడేసింది. 3 ప్రాంతాల ప్రజలు వైసీపీని ఓడించారు. వై నాట్ 175 అని చెప్పిన జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో వైసీపీలో చాలా మంది నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. ఇక అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండటంతో.. ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే.. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు కలిపి మావిగన్ అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామంటున్నారు కూడా. ఇక్కడే ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసుల నుంచి వైసీపీ నేతలకు గట్టి షాక్ తగులుతోంది.

Also Read : శాసిస్తున్న వైసీపీ మాజీ మంత్రి..!

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించామన్న జగన్.. అక్కడ ప్రభుత్వ సొమ్ముతో ప్యాలెస్‌లు కట్టారు. నిజానికి ఆ ప్యాలెస్‌లు పర్యాటకంగా కూడా ఉపయోగించలేని పరిస్థితి. హోటల్‌ గదులకు అనువుగా లేవు. తన విలాసాల కోసమే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. నిన్నటి వరకు విశాఖ.. అంటూ ఉత్తరాంధ్ర వాసులను మోసం చేసిన జగన్.. ఇప్పుడు మాత్రం.. జై మావిగన్ అంటున్నారు. అంటే.. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రపై జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనా అనే మాట బాగా వినిపిస్తోంది. జగన్ మావిగన్ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు కంగుతింటున్నారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ అని.. రాబోయే ఎన్నికల్లో మావిగన్ అంటే.. ప్రజలు తమ ముఖం కూడా చూడరని ఇప్పటి నుంచే మదన పడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నన్ను వేధించోద్దు ప్లీజ్.....

కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం తన...

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

పోల్స్