Friday, August 14, 2026 12:07 PM
Friday, August 14, 2026 12:07 PM

టాటా సియెర్రా ఈవీ రేంజ్ మామూలుగా లేదుగా..!

ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ జూన్ 30న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ లోపే టాటా మోటార్స్ ఒక ప్రమోషనల్ వీడియో ద్వారా ఈ కార్ ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. అబుదాబీలోని ఎత్తైన ఇసుక తిన్నెలపై ఈ కార్ ఎంత సులువుగా దూసుకెళ్లగలదో ఇందులో చూపించారు. ఈ వీడియో ప్రకారం.. కారులో కేవలం 80% బ్యాటరీ ఛార్జ్ ఉన్నప్పుడే డిస్‌ ప్లేపై 424 కి.మీ రేంజ్ కనిపించింది. దీనిని బట్టి కారును పూర్తి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also read : స్టోక్స్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ నడిచిందా..?

ఆఫ్ రోడ్ ప్రయాణాల కోసం ఇందులో హారియర్ ఈవీ తరహాలోనే టెర్రైన్ మోడ్స్ అందించారు. ఈ ఈవీ కార్‌ లో రెండు మోటార్లు అమర్చబడి ఉంటాయి. టాటా మోటార్స్ దీనిని క్వాడ్ వీల్ డ్రైవ్ గా పిలుస్తోంది. రహదారి పరిస్థితులను బట్టి కారు ముందు, వెనుక మోటార్లకు సమానంగా ఎనర్జీ అందేలా ఇది రియల్ టైమ్ టార్క్ డిస్ట్రిబ్యూషన్‌ ను మేనేజ్ చేస్తుంది. దీనివల్ల ఇసుక, బురద లాంటి తక్కువ గ్రిప్ ఉండే రోడ్లపై కూడా కారు అస్సలు జారిపోకుండా అద్భుతమైన స్థిరత్వాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Also read : అయోధ్య విరాళాల చోరీ కేసులో సంచలనం..!

టాటా సియెర్రా ఈవీ బాడీకి గ్రే కలర్‌ కు బదులుగా గ్లోస్ బ్లాక్ క్లాడింగ్‌ ను ఉపయోగించారు. అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కారు లోపల గ్లోస్ బ్లాక్ సెంటర్‌ తో కూడిన స్టీరింగ్ వీల్, వెలిగిపోయే టాటా లోగో ఉన్నాయి. డ్రైవర్ సౌకర్యం కోసం హెడ్-అప్ డిస్‌ ప్లే, ఆధునిక డ్రైవర్-అసిస్ట్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కారు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గ్లోబల్ స్టేజీపై అమరావతి...

భారతదేశ అర్బన్ ప్లానింగ్ చరిత్రలోనే అత్యంత...

అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య...

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ...

అమరావతి సీడ్ యాక్సెస్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా...

అమరావతికి రాచబాట.. సీడ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది....

కృష్ణా, గుంటూరు జిల్లాల...

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని...

కర్నూలులో పొలిటికల్ హీట్.....

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర...

పోల్స్