Saturday, June 27, 2026 06:02 PM
Saturday, June 27, 2026 06:02 PM

ట్రంప్ డిజిటల్ పన్నులు..? భారత్ పై ఎఫెక్ట్..!

అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలపై డిజిటల్ సేవల పన్ను విధించే దేశాలకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన వార్నింగ్ ఇచ్చారు. తమ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పన్నులు విధిస్తే, ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 100 శాతం టారిఫ్ విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త నిర్ణయం సదరు దేశాలతో గతంలో కుదిరిన లేదా భవిష్యత్తులో రాబోయే అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలను అధిగమించి వర్తిస్తుందని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ ఫారమ్ ద్వారా ట్రంప్ ప్రకటించారు.

Also Read : తెలంగాణా సర్కార్ కు ట్రంప్ థాంక్స్..!

గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్ వంటి యూఎస్ కంపెనీలను ఇబ్బంది పెట్టేందుకే కొన్ని దేశాలు ఈ డిజిటల్ పన్నులను వాడుతున్నాయని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రంప్ ఇచ్చిన ఈ 100% టారిఫ్ హెచ్చరిక వల్ల భారత్ కు ఎలాంటి ముప్పూ వాటిల్లే అవకాశం లేదు. ఎందుకంటే, విదేశీ డిజిటల్ కంపెనీలపై భారత్ గతంలో విధించిన ఈక్వలైజేషన్ లెవీ రెంటినీ భారత ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా రద్దు చేసింది. ఇ-కామర్స్ కంపెనీలపై ఉన్న 2 శాతం లెవీని ఫైనాన్స్ యాక్ట్ 2024 ద్వారా, అలాగే డిజిటల్ ప్రకటనలపై ఉన్న 6 శాతం లెవీని ఫైనాన్స్ బిల్ 2025 ద్వారా ముందే తొలగించింది.

Also Read : జగన్‌ను ఆదర్శంగా తీసుకున్న కేటీఆర్..!

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్ ఈ పన్నులను రద్దు చేయడంతో, ప్రస్తుత ట్రంప్ హెచ్చరికల నుండి దేశానికి పూర్తి ఊరట లభించినట్లయింది. ట్రంప్ చేసిన ఈ తాజా ప్రకటన ప్రధానంగా ఫ్రాన్స్, స్పెయిన్, ఆస్ట్రియా, బ్రిటన్ వంటి యూరోపియన్ దేశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఇప్పటికే ఫ్రాన్స్ విధిస్తున్న 3% డిజిటల్ పన్నుకు వ్యతిరేకంగా అక్కడి వైన్, షాంపేన్ దిగుమతులపై 100% పన్ను వేస్తామని ట్రంప్ ఈ నెల ప్రారంభంలోనే బెదిరించారు. అమెరికా తీసుకుంటున్న ఈ ఏకపక్ష నిర్ణయాలపై యూరోపియన్ యూనియన్ కూడా గట్టిగానే స్పందించింది. ఒకవేళ అమెరికా గనుక తమ ఉత్పత్తులపై అదనపు టారిఫ్లు విధిస్తే, తమ స్వయం ప్రతిపత్తిని మరియు వాణిజ్య హక్కులను కాపాడుకోవడానికి తాము కూడా అంతే వేగంగా, దీటుగా సమాధానం ఇస్తామని యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నేతలను తరిమి...

అమరావతి... ఇది కేవలం ఒక ప్రాంతం...

తిరుపతిలో భూమన దారుణాలు.....

తిరుపతి నగరంలో వైసీపీ సీనియర్ నేత,...

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

ఏపీ మ్యాప్ తో...

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

పోల్స్