Saturday, June 27, 2026 02:45 PM
Saturday, June 27, 2026 02:45 PM

జగన్‌ను ఆదర్శంగా తీసుకున్న కేటీఆర్..!

మేము అధికారంలోకి వస్తే.. అనే మాట రాజకీయాల్లో సర్వ సాధారణం. ప్రజలు మేలు చేస్తాం.. ఉద్యోగాలు కల్పిస్తాం.. ఉచితంగా పథకాలు అందిస్తాం.. మౌలిక వసతులు కల్పిస్తాం.. అంటూ లెక్క లేనన్ని హామీలు ఇస్తారు. ఇది తొలి నుంచి వినిపిస్తున్న మాటలే. 2 రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలాంటి హామీలు కూడా “మేము అధికారంలోకి వస్తే..” అంటూ పార్టీల అధినేతలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా హామీల వర్షం కురిపిస్తారు. అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తే మాత్రం.. అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అదే బెదిరింపులు.

Also Read : ఏపీ మ్యాప్ తో మార్కెట్లోకి జొన్నగిరి గోల్డ్..!

“మేము అధికారంలోకి వస్తే..” అంటూ ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుపెట్టారు. తమ పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతున్న పోలీసులను ముందుగా బెదిరించారు. ఆ తర్వాత అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అది ఏ రేంజ్‌లో ఇచ్చారంటే.. మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా.. పదవీ విరమణ చేసినా కూడా.. మిమ్మల్ని వదిలేది లేదంటూ బెదిరించారు. దీంతో అప్పట్లో ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. చివరికి వైసీపీ నేతలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు తిరుగుబాటు చేయడంతో.. ఆ తర్వాత నుంచి వైసీపీ నేతలు అలా బెదిరించడం ఆపేశారు.

అయితే.. తాజాగా వైసీపీ అధినేత బాటలోనే మరో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బెదిరింపులకు దిగడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నేతలతో సమావేశమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా జగన్ తరహాలోనే.. “మేము అధికారంలోకి వస్తే.. మీ తాట తీస్తాం.. మీ సంగతి చూస్తాం.. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే.. వదిలేది లేదు.. గల్లా పట్టి మరీ లాక్కొస్తాం.. ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా బాకీ చెల్లిస్తాం..” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వెంటనే.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా ఆహా ఓహో అంటూ చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.

Also Read : యూఎస్ వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..!

అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్‌ను అనుకరిస్తున్నారని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పని చేసిన అధికారులే.. ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. నిజానికి అధికారులు.. ప్రభుత్వాధినేతలు చెప్పినట్లుగా.. అలాగే రూల్స్ ప్రకారం పని చేస్తారు. నేతలు నోరు జారితే, తప్పు చేస్తే, అవినీతి చేస్తే.. వారిపై న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి పైన వారు చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కేటీఆర్, హరీష్ రావుపై అవినీతి ఆరోపణలతో విచారణ జరుపుతున్నారు. అయితే ఇవన్నీ తప్పని.. తమని టార్గెట్ చేస్తున్నారని.. తమపై కేసులు నమోదు చేసిన అధికారుల సంగతి చూస్తామని కేటీఆర్ బెదిరించడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ పోలీసులపై మానవ...

ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ...

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

ఏపీ మ్యాప్ తో...

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

పోల్స్