Monday, September 28, 2026 07:36 AM
Monday, September 28, 2026 07:36 AM

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక భేటీ.. తుంగభద్ర వేదికగా సరికొత్త రాజకీయం..!

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ వేడుక దక్షిణ భారతదేశంలో ఒక అరుదైన రాజకీయ కలయికకు వేదికైంది. హోసపేటలోని ఐఆర్బీ (IRB) అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. భిన్న రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు ఒకే చోట చేరి నవ్వుతూ ముచ్చటించుకోవడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, మరియు వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ అరుదైన దృశ్యాలను చూసి ముగ్గురు సీఎంల సందడి అంటూ వైరల్ అవుతున్నాయి.

Also Read : ఉక్రెయిన్‌ కు భారత సైన్యం..? వైట్ హౌస్ సీక్రెట్స్ లీక్..!

మునీరాబాద్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి భేటీలో ప్రధానంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి పంపకాలపై కీలక చర్చలు జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్ మరియు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని సమస్యల పరిష్కారమే అజెండాగా మాట్లాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొని ఏపీ తరఫున కీలక అంశాలను ప్రస్తావించారు.

Also Read : వెనెజులాలో ‘ట్విన్’ భూకంపాలు.. మరణాల సంఖ్య ఊహకు అందదా..?

తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపి వంటి విభిన్న రాజకీయ పంథాలు కలిగిన మూడు పెద్ద పార్టీల నేతలు ఒకే తాటిపైకి రావడం ఈ భేటీ ప్రత్యేకత. రాజకీయ విభేదాలు, వివాదాలను పక్కన పెట్టి, రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల కోసం ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోవడం దేశ రాజకీయాల్లో ఒక మంచి ఆరోగ్యకరమైన పరిణామంగా నిలిచింది. తుంగభద్ర సాక్షిగా సాగిన ఈ సఖ్యత భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు కొత్త బాటలు వేయనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్