Wednesday, August 5, 2026 10:56 AM
Wednesday, August 5, 2026 10:56 AM

ఇంగ్లాండ్ లో కింగ్ దిగుతాడా..?

భారత క్రికెట్ అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాబోయే ఇంగ్లాండ్ వన్‌ డే సిరీస్‌ లో ఆడతాడా లేదా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. దీనికోసం జూన్ 26న యూకేలో విరాట్ కోహ్లీకి కీలకమైన ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ ఫలితాల ఆధారంగానే అతను ఇంగ్లాండ్ టూర్‌ కు ఎంపిక చేయాలా వద్దా అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలపడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.

Also Read : ధనుష్ – మృణాల్ బ్రేకప్..? నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్..!

అయితే ఆ తర్వాత ఆయన హ్యామ్‌ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ కారణంగానే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ తో జరుగుతున్న సిరీస్‌ కు ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోహ్లీ గాయం నుంచి బాగానే కోలుకున్నారని, ఫిట్‌ నెస్ టెస్ట్ పాస్ అవుతారని టీమ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి జట్టు ఎంపికపై మరో కీలక అప్డేట్ కూడా వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ లో ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ వన్‌ డే సిరీస్‌ కు కూడా అందుబాటులో ఉంటాడని సమాచారం.

Also Read : తిరుపతిలో వడ్డీ మాఫియా.. భూమన అనుచరుల దందా..!

అయితే, స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టూర్‌ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ ప్రోటోకాల్స్ రీత్యా అతన్ని ఈ సిరీస్‌ కు ఎంపిక చేసే అవకాశం లేదని సమాచారం. ఇదిలా ఉంటే, 2027 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. బోర్డు రూమ్‌ లో జరిగే వ్యూహాత్మక చర్చలు మీడియా లేదా పబ్లిక్ కోసం కాదని ఆయన తేల్చి చెప్పారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్, సపోర్ట్ స్టాఫ్ మరియు ప్లేయర్లతో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయని, ఆ వివరాలను ముందే బయటపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్