Thursday, September 17, 2026 08:50 PM
Thursday, September 17, 2026 08:50 PM

గోదావరి – బనకచర్లకు సంపూర్ణ మద్దతు..!

గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు మద్దకు క్రమంగా పెరుగుతోంది. గోదావరి నది వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి హక్కులు ఉన్నాయని, ఆ నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సమర్థనీయమని ఏపీ జలవనరుల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1978లో వెలువరించిన తీర్పును వారు తమ లేఖలో ప్రస్తావించారు.

Also Read : రోడెక్కుతున్న తూర్పు కాపులు.. కారణం..!

ఎగువ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు పోగా, దిగువకు ప్రవహించే మిగులు వరద జలాలను వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉందని లేఖలో స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం – 1956 ప్రకారం, ఈ మిగులు జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం గానీ, ఎగువ రాష్ట్రాలు గానీ అభ్యంతరం తెలిపే అధికారం లేదని తేల్చిచెప్పారు. గోదావరి -బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా వరద నీటిని బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసి, కరవు పీడిత ప్రాంతాలైన కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలకు 75 శాతానికి పైగా సాగునీటి భరోసా కల్పించవచ్చని ఇంజనీర్ల సంఘం వివరించింది.

Also Read : చరణ్ – సుకుమార్ ప్రాజెక్ట్ ఎప్పుడో..?

ఈ ప్రాజెక్టు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీటి అవసరాలను తీర్చి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి కూడా ఎంతో దోహదపడుతుందని లేఖలో స్పష్టం చేశారు. గోదావరి జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చర్చలు, న్యాయపరమైన అంశాలు నడుస్తున్న తరుణంలో విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ సంఘంలో చాలా వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసిన ఇంజనీర్లే సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి మిగులు జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకు గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని విశ్రాంత ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్