Thursday, September 17, 2026 10:42 PM
Thursday, September 17, 2026 10:42 PM

పైకి సింగిల్‌ సింహం.. చీకటిలో అందరితో మింగిల్‌..!

సింహం సింగిల్‌గా వస్తుంది అంటూ.. వైసీపీ నాయకులు.. వాళ్లకు వాళ్లే ఇచ్చుకునే ఎలివేషన్లకు ఎండ్‌ కార్డు పడే రోజులు దగ్గరకొస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. వెన్నుపోటు దినం పేరుతో నాయకులను రోడ్ల మీద పడేసిన బిగ్‌బాస్‌ బెంగళూరు చెక్కేసి.. ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకొంటున్నారు. దీనిపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నాయి.

Also Read : ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌.. పంచాయితీలకు పండగ

ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్లయినా.. వైసీపీ పట్ల ప్రజల్లో ఏమాత్రం పాజిటివ్‌ వైబ్స్‌ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి.. ప్రత్యర్ధుల ఓటర్లలో 5 నుంచి పది శాతాన్ని తమ వైపు తిప్పుకొంటే మళ్లీ అధికారంలోకి రావొచ్చని.. ప్యాలెస్‌ పెద్దలు లెక్కలేసుకున్నారు. ఆ లెక్కల్లో అంతులేని తప్పులున్నాయని ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ గ్రాఫ్ స్పష్టం చేస్తోంది. 2024లో వైసీపీకి ఓటు వేసిన వారిలో ఇప్పుడు ఎంత మంది ఇంకా ఆ పార్టీతోనే ఉన్నారు. ఎంత మంది వదిలేసి వెళ్లారనేది తాడేపల్లి కోటరీకి అంతుపట్టని మిస్టరీలా మారింది.

Also Read : రోడెక్కుతున్న తూర్పు కాపులు.. కారణం..!

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సింగిల్‌గా ఢీకొట్టడం కష్టమనే సంగతి ఇప్పుడిప్పుడే జగన్‌ బ్యాచ్‌కి అర్ధమవుతోంది. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడానికి జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి విడిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతాయనే ప్రచారం జరుగుతోంది.

Also Read : ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌.. ఎలాన్ మస్క్..!

వైసీపీలో జగన్‌తో మొదలుపెట్టితే 80 శాతానికిపైగా నాయకులు… కార్యకర్తల్లో దాదాపు అందరూ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వాళ్లే. ఇప్పుడు పార్టీ భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో.. వైసీపీ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ జగన్‌ మీదున్న కేసుల కారణంగా ఇప్పటికిప్పుడు బీజేపీని వ్యతిరేకించే అవకాశం లేదు. మొన్నటి ప్రెస్‌ మీట్‌లో కేంద్రం గురించి మాట్లాడను.. మాకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పడం ద్వారా.. బీజేపీ విషయంలో జగన్‌ స్టాండ్‌పై అందరికీ క్లారిటీ వచ్చేసింది. మొత్తం మీద పైకి సింగిల్‌గా కనిపిస్తున్నా.. లోలోపాల లోపాయికారీగా అటు బీజేపీతోనూ.. ఇటు కాంగ్రెస్‌తోనూ జగన్‌ ఆడుతున్న డబుల్‌ మింగిల్‌ గేమ్‌ ముందు ముందు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్