ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో చారిత్రాత్మక మైలురాయి చేరువయ్యారు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ అవతరించారు. మస్క్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ ఎక్స్ భారీ విజయంతో అమెరికా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు నమోదు చేశాడు. స్పేస్ ఎక్స్ నిర్వహించిన ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. కంపెనీ ఏకంగా 75 బిలియన్ డాలర్లు సమీకరించగా, సంస్థ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. దీంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఏకంగా లక్ష కోట్ల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో 95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించారు.
Also Read : కామెడీ పేరుతో లేకి పనులు.. వెకిలి చేష్టలు..!
అసలు ట్రిలియనీర్ అంటే ఏమిటి?.. ప్రస్తుతం ప్రపంచంలో బిలియనీర్లు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ, ట్రిలియనీర్ మాత్రం ఇప్పటివరకు ఎవరూ కాలేదు. ఒక ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు.. అంటే భారతీయ సంఖ్యామానంలో ఒక లక్ష కోట్లు అని పిలుస్తారు. ప్రస్తుతం మస్క్ ఆస్తి లక్షకోట్ల అమెరికన్ డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో ఎంత? ప్రస్తుతం 1 డాలర్ 95 రూపాయలు అనుకుంటే.. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే, సుమారు రూ.95 లక్షల కోట్లు, ఈ మొత్తం భారత కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద ఎంత? టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్), ఎక్స్ప్రెఐ, న్యూరాలింక్ వంటి సంస్థల్లో ఉన్న వాటాల కారణంగా ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన వ్యక్తిగత సంపద సాధారణంగా 350 నుంచి 450 బిలియన్ డాలర్ల మధ్య మారుతూ ఉంటుంది. అయితే స్పేస్ ఎక్స్ షేరు 150 డాలర్లుగా లిస్ట్ అయ్యింది. పబ్లిక్ ఇష్యూతో పోలిస్తే.. ఇది 11 శాతం అధికం. దీంతో ఏరో స్పేస్ కంపెనీ విలువ 1.96 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో 186 లక్షల కోట్లు. స్పేస్ ఎక్స్ కంపెనీలో మస్క్‌కు 480 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ షేరు విలువ పెరగడంతో.. మస్క్ సంపద విలువ కూడా 1.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది.
Also Read : కేంద్ర మంత్రివర్గంలో జనసేన.. ఆయనే ఫైనల్..!
స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సంచలనంగా మారింది. కంపెనీ విక్రయానికి ఉంచిన షేర్ల కంటే మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. సంస్థాగత పెట్టుబడిదారులతో పాటు చిన్న పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఐపీఓ విజయవంతం కావడంతో స్పేస్ఎక్స్ ప్రపంచంలోని అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీల సరసన నిలిచింది. అయితే అందరూ ఈ విలువను సమర్థించడం లేదు. కొంతమంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్పేస్ ఎక్స్ సంస్థకు మార్కెట్ అధిక విలువ కట్టిందని అంటున్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ మార్నింగ్ స్టార్ అంచనా ప్రకారం, కంపెనీ షేర్ అసలు విలువ ఐపీఓ ధర కంటే తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. అయినప్పటికీ, అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ సేవలు, కృత్రిమ మేధస్సు రంగాల్లో స్పేస్ ఎక్స్ వేగంగా విస్తరిస్తుండటంతో పెట్టుబడిదారులు భారీగా ఆకర్షితులవుతున్నారు.
ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్? ప్రస్తుతం ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ కాలేదు. అయితే స్పేస్ఎక్స్, టెస్లా, ఎక్స్ఐ వంటి సంస్థల విలువలు ఇదే వేగంతో పెరుగుతూ ఉంటే, ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ గా నిలిచే వ్యక్తి ఎలాన్ మస్క్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని విశ్లేషకులు భావిస్తు న్నారు. అంతరిక్షం నుంచి కృత్రిమ మేధస్సు వరకు విస్తరించిన మస్క్ వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు మరో చారిత్రా త్మక రికార్డు దిశగా పయనిస్తుం డటంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి దారుల దృష్టి స్పేస్ ఎక్స్ పైనే నిలిచింది.

