Monday, August 3, 2026 01:13 PM
Monday, August 3, 2026 01:13 PM

గెట్ రెడీ ఫర్ ఓజీ సీక్వెల్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ తీపి కబురు అందించింది. పవన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ప్రాజెక్టుపై దర్శకుడు సుజీత్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ తాజాగా వెల్లడించింది. “ఇచ్చిన మాట ప్రకారం ఆయన వస్తారు.. సమయం ఆయనే నిర్ణయిస్తారు. సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే #OG2 గురించి చర్చిస్తాం” అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Also Read : కేంద్ర మంత్రివర్గంలో జనసేన.. ఆయనే ఫైనల్..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆయన సినిమాలకు విరామం ఇస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. 2025 సెప్టెంబర్‌లో విడుదలైన ‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘ఓజస్ గంభీరా’ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలుత మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Also Read : కింగ్ పిన్ చుట్టూ ఉచ్చు.. ఫైనల్ కాల్‌కు లైన్ క్లియర్..!

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్, సీక్వెల్ స్క్రిప్ట్‌పై ఇప్పటికే కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఆయన స్వదేశానికి చేరుకున్న తర్వాత ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చలు జరగనున్నాయి. అయితే షూటింగ్ ప్రారంభ తేదీ, ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు. ఈ తాజా అప్‌డేట్‌తో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్