Friday, June 19, 2026 01:26 PM
Friday, June 19, 2026 01:26 PM

రోడెక్కుతున్న తూర్పు కాపులు.. కారణం..!

తూర్పు కాపులో తొలిసారి రోడెక్కారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసించే ఒక ప్రధాన సామాజిక వర్గం. మూడు జిల్లాల్లో సుమారు 18 లక్షల ఓటర్లు ఉన్న తూర్పు కాపులు.. ఇప్పుడు తొలిసారిగా ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తూర్పు కాపు నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు సరైన న్యాయం జరగటం లేదని.. మంత్రివర్గంలో కూడా తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని ఇప్పుడు తూర్పు కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పు కాపు పోరు పేరుతో కూటమిపై యుద్దం ప్రకటిస్తున్నారు.

Also Read : కేంద్ర మంత్రివర్గంలో జనసేన.. ఆయనే ఫైనల్..!

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాలుగు కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అవే ధర్మాన, కింజరాపు, కిమిడి, బొత్స కుటుంబాలు. వీటిల్లో బొత్స, కిమిడి కుటుంబాలు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవి. ఈ రెండు కుటుంబాలకు ఉత్తరాంధ్రలో బంధువర్గం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 2014లో కిమిడి మృణాళిని విజయం సాధించగా.. 2019లో బొత్స గెలిచారు. 2024 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు ముఖాముఖి తలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికలో కళా వెంకట్రావు విజయం సాధించారు. దీంతో కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు.

Also Read : బదిలీలపై నిషేధం తొలగిస్తారా..?

అయితే అనూహ్యంగా ఆయన పేరు క్యాబినెట్ జాబితాలో కనిపించలేదు. పైగా సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరిన కొండపల్లి శ్రీనివాస్‌ను మంత్రిగా ప్రకటించారు. తాజాగా కొండపల్లి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తూర్పు కాపులు.. ఆయనను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తమ సామాజిక వర్గానికి రాజకీయ పరంగా సరైన గుర్తింపు ఇవ్వటం లేదంటూ కూటమి సర్కార్‌పై తిరుగు బావుటా ఎగుర వేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం పట్టణంలో తూర్పు కాపుల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో బలమైన, నిర్ణయాత్మక స్థితిలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

పోల్స్