Saturday, August 1, 2026 07:51 PM
Saturday, August 1, 2026 07:51 PM

అలాంటి వారితో బీ కేర్ ఫుల్..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మద్ధతిచ్చిన వ్యక్తి పైనే తెలంగాణ నేతల ఆరోపణలు, విమర్శలా..?. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఎన్నెన్ని కారణాలు ఉన్నాయో.. అనే విషయం పక్కన బెడితే, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముఖ్యకారణం చంద్రబాబు నాయుడు. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన సిపార్సు లేఖ అని ఇప్పుడు చంద్రబాబును తిట్టే వారికి తెలియకుండా ఉంటుందా..? చంద్రబాబు ఇచ్చిన సిఫార్సు లేఖ ప్రభావం కూడా కొంత కారణం అని అప్పటి కేంద్ర మంత్రి, దివంగత జయపాల్ రెడ్డి స్వయంగా చేసిన ప్రకటన చాలా మంది కాంగ్రెస్ నేతలకు తెలుసు కూడా.

Also Read : టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

తెలంగాణ ఏర్పడటానికి, అప్పటి మాజీ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొప్పుల రాజు కూడా కారణం అని, కేసీఆర్ సహా తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు. హైదరాబాద్‌ను కేంద్ర ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్‌కు వచ్చే ఆదాయం రెండు రాష్ట్రాలకు సమంగా పంచాలని పలువురు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, సోనియా గాంధీని స్వయంగా కలిసి విన్నవించారు. అయితే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడాన్ని టెక్నికల్‌గా చంద్రబాబు వ్యతిరేకించారు. హైదరాబాద్ లేని తెలుగు రాష్ట్రాలను ఊహించలేమని చంద్రబాబు అప్పట్లో వ్యాఖ్యానించారు కూడా. దీంతో హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్రంలో భాగమని నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం కూడా జయపాల్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.

Also Read : మిత్రులే మోసం చేస్తున్నారా..? సంక్షోభంలో INDIA కూటమి

చంద్రబాబు ఇచ్చిన సిఫార్సు లేఖ వల్లే హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అప్పటి తెలంగాణ టీడీపీ నాయకులలో ప్రముఖులైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి నాయకులే ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను పోరాడినా కూడా చంద్రబాబు అనుకూలంగా ఇచ్చిన లేఖ ప్రభావం పనిచేసిందని కేసీఆర్ కూడా తనను కలిసిన వారితో వ్యాఖ్యానించారు. ఇదంతా ఇప్పుడు గొంతు చించుకుంటున్న తెలంగాణ నాయకులు తెలుసు కూడా. ఇక 13 ఏళ్ల క్రితమే జరిగిన ఘటనలు పాత్రికేయ వృత్తిలో సీనియర్లతో పాటు తెలంగాణ మేధావులు కూడా అప్పుడే మర్చిపోయారంటే.. అది హాస్యాస్పదమే.

Also Read : రవి నాయుడే టార్గెట్ ఎందుకు..?

కానీ సీనియర్ జర్నలిస్టులు సహా మేధావులు ఇప్పుడు మాత్రం.. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని.. ఏపీ సీఎం ప్రతి వారం హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మేలు మర్చిపోయి, ఆయనను బూతులు తిడుతున్నారు. ఇక కొందరు రాజకీయ నేతలైతే.. కొంతమంది వెనకుండి మరీ అదే పనిగా తిట్టించే పని చేస్తున్నారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వాస్తవాలు తెలిసినా కూడా తమకు ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరకు తాము ఎంత సహాయం చేసినా, మేలు చేసినా, ఆపదలో ఆదుకున్నా కూడా తెలంగాణ రాజకీయ నాయకులతో పాటు జర్నలిస్టు, మేధావులు కూడా అవన్నీ మర్చిపోయారని.. పైగా తెలుగుదేశం పార్టీ అంటే.. ఆంధ్రోళ్ల పార్టీ అన్నట్లుగా చూస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంతమంది జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో పాటు తెలంగాణ జర్నలిస్టుల ముసుగులో బీఆర్ఎస్ అభిమానులు కూడా చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన పదే పదదే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఇలా విమర్శలు చేస్తున్న చాలా మంది ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు తెలంగాణకు చెందిన జర్నలిస్టులని చెప్పుకునే వారు అయితే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మీడియా సంస్థల్లోనే పని చేస్తున్నారు. అయినా సరే.. వారంతా.. తామే నిజమైన తెలంగాణ వాదులని.. చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలంతా హైదరాబాద్ నగరం నుంచి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇలాంటి వారు సమాజానికి చాలా చాలా ప్రమాదం. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త అని తెలంగాణకు చెందిన వారే హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్