Monday, June 8, 2026 11:48 PM
Monday, June 8, 2026 11:48 PM

మిత్రులే మోసం చేస్తున్నారా..? సంక్షోభంలో INDIA కూటమి

‘ఇండియా’ కూటమిలో తాజాగా విభేదాలు పొడ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా జట్టు కట్టిన పార్టీల్లో ఇప్పుడు ఆధిపత్య పోరు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మిగిలిన పార్టీలు క్రమంగా దూరం అవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే దూరమవ్వగా.. ఢిల్లీలో ఆప్ కూడా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. తాజాగా జార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్‌ కూటమి సర్కార్‌లో విబేధాలు మొదలైనట్లు తెలుస్తోంది. జార్ఖండ్ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటు ఆశిస్తోంది. పార్టీ నుంచి పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థి పేరును ఇప్పటికే ప్రకటించింది. అయితే రెండు రాజ్యసభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు జేఎంఎం తాజాగా నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Also Read : పైసాకు పలికే ప్రొఫెసర్ నాగేశ్వర్‌

రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జేఎంఎం శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఖాళీగా ఉన్న రెండు సీట్లలో కూడా జేఎంఎం పోటీ చేయాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు సమావేశానంతరం రాష్ట్ర మంత్రి యోగేంద్ర మెహతో వెల్లడించారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు అప్పగించినట్టు వివరించారు. ఈ క్రమంలో రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాగస్వామ్య పార్టీలతో సోరెన్ సంప్రదింపులు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జార్ఖండ్ నుంచి పోటీ చేసే అభ్యర్థితో పాటు ఏడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భాగస్వామ్య పక్షంగా తమకు ఒక సీటును జేఎంఎం కేటాయిస్తుందనే అభిపాయంతో కాంగ్రెస్ ఉంది. రెండు సీట్లూ తమకే కావాలని జేఎంఎం పట్టుపడితే ఇరుపార్టీల విభేదాలు ఖాయమనే మాట వినిపిస్తోంది. జార్ఖండ్‌లో చాలాకాలంగా జేఎంఎం, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. సోరెన్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

Also Read : రవి నాయుడే టార్గెట్ ఎందుకు..?

మరోవైపు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తలెత్తాయి. పార్టీ రెబెల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాబోయే రోజుల్లో టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు పట్టు సాధించారు. పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 57 మంది టీఎంసీలు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను స్పీకర్ రతీంద్ర బోస్ కూడా గుర్తించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని గౌరవిస్తున్నామని చెబుతూనే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పుకునేది లేదని కరాఖండిగా చెబుతున్నారు.

Also Read : రష్యా హై అలర్ట్ లోనూ.. ఆగని లోకేష్ మిషన్

తాజాగా టీఎంసీ ఎంపీల్లో కూడా అసంతృప్తి పెరిగింది. అభిషేక్ బెనర్జీ పట్ల పలువురు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడే దిశగా చర్చలు జరుపుతున్నారని, 12 మందికి పైగా ఎంపీలు ఇందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఎంసీకి లోక్‌సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటుపడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరమవుతుంది. రాజ్యసభ పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలున్నారు. అయితే రెబల్ నేత రీతాబత్ర బెనర్జీ మాత్రం.. తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల తనకు ఏమీ తెలియదంటున్నారు.

అటు జార్ఖండ్‌లో కాంగ్రెస్ – జేఎంఎం మధ్య రాజ్యసభ సీట్ల పంపకం, ఇటు బెంగాల్‌లో మమతా పార్టీలో విభేదాలు, మరోవైపు తమిళనాడులో బీజేపీకి దగ్గరయ్యేందుకు డీఎంకే ప్రయత్నాలు.. ఇవన్నీ ఇండియా కూటమిని నిర్వీర్యం చేసేవిగా ఉన్నాయనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన పార్టీలు.. ఇప్పుడు విడిపోవడం వెనుక రాజకీయ చతురత ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో...

సామాన్యుడి కోరిక తీర్చనున్న...

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక...

పైసాకు పలికే ప్రొఫెసర్...

తెలంగాణ సమాజంలో మేధావిగా, విశ్లేషకుడిగా చలామణి...

పోల్స్