Tuesday, July 21, 2026 08:37 PM
Tuesday, July 21, 2026 08:37 PM

కేటీఆర్ పాదయాత్ర.. వర్కవుట్ అవుతుందా..?

ఏ పార్టీ నేత పాదయాత్ర చేస్తే ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఖాయం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పదేళ్ల టీడీపీని గద్దె దించేందుకు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2012లో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2018లో జగన్ కూడా పాదయాత్ర చేశారు. 2019లో అధికారంలోకి వచ్చారు. ఇక 2023లో టీడీపీ నేత లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే సెంటిమెంటు కొనసాగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రను ఎంచుకున్నారు.

Also Read : రాజ్యసభ అభ్యర్థి ఎంపిక.. పవన్‌కు అగ్నిపరీక్ష..!

2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు తాజాగా కేటీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా “ఈలోపు ఫిట్ అవుతాను” అని చెబుతూ, పాదయాత్ర మార్గం పార్టీ చర్చల అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావడంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉంటుందంటున్నారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్‌కు ప్రజలకు మధ్య ఒక దూరం ఏర్పడింది. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పాలన, అధికార దూరం వల్ల గ్రామీణ, ప్రజా స్థాయి సంబంధాలు బలహీనపడతాయి. బీఆర్ఎస్ ఈ వాస్తవాన్ని అంగీకరించి, పాదయాత్ర ద్వారా ఆ అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ వరకు అనేక మంది నాయకులు పాదయాత్రలు చేశారు. కేటీఆర్ కూడా ఇప్పుడు అదే మార్గం ఎంచుకోవడం ఆయన ఇమేజ్‌ను ‘హై టెక్, అర్బన్ నాయకుడి’ నుంచి ‘ప్రజా నాయకుడి’గా మార్చుకోవాలన్న తపనను సూచిస్తోంది. కేటీఆర్ మరో ముఖ్యమైన విషయం స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎలాంటి కూటములు లేవని ప్రకటించారు. ఇది ఒకవైపు ధైర్యవంతమైన నిర్ణయం కాగా, మరోవైపు ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఆ పార్టీకి పెద్ద సవాలు కూడా. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తున్నప్పటికీ, పార్టీ సంస్థాగత బలం గణనీయంగా తగ్గింది.

Also Read : ఏపిలో దూకుడు పెంచిన పవన్..!

ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా కేడర్‌ను పునరుజ్జీవింపజేయడం, కొత్త నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల సమస్యలను నేరుగా అర్ధం చేసుకోవడం అత్యంత కీలకం. కేటీఆర్ పాదయాత్ర విజయవంతమైతే, అది బీఆర్ఎస్ ను మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ఆప్షన్ గా నిలబెట్టే అవకాశం ఉంది. అయితే, పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు. దాని వెనుక స్పష్టమైన అజెండా, ప్రజల సమస్యలపై నిజమైన దృష్టి, స్థిరమైన సందేశం ఉండాలి. లేనప్పుడు ఇది ఒక ఏడాది ముందు ఎన్నికల డ్రామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 2027లో ఆయన పాదయాత్ర ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటుందనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్