Tuesday, July 21, 2026 09:33 PM
Tuesday, July 21, 2026 09:33 PM

క్షణాల్లోనే పీఎఫ్ డబ్బులు వచ్చేస్తాయంట..!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ.. ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులు ఇకపై తమ భవిష్య నిధి ఖాతాల్లోని అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ కొత్త వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకోవాలంటే దరఖాస్తు ప్రక్రియ, పరిశీలన ఆమోదం వంటి దశల కారణంగా పలుమార్లు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

Also Read : టీడీపీ ఖాతాలో మరో కేబినెట్ బెర్త్..!

ముఖ్యంగా పెద్ద మొత్తాల ఉపసంహరణకు అదనపు ధ్రువీకరణ అవసరమవుతుండటంతో ఆలస్యం అవుతుంది. దీని వల్ల ఉద్యోగుల అవసరాలకు సరైన సమయంలో డబ్బు అందటం లేదు. దీనిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలకు ముగింపు పలకాలని అధికారులు భావిస్తున్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో సభ్యులు తమ ఖాతాలోని అర్హత ఉ న్న మొత్తాన్ని కేవలం కొన్ని నిమిషాల్లోనే పొందగలుగుతారు. అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సభ్యుడికి చెల్లుబాటు అయ్యే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉండాలి. ఆ ఖాతాకు ఆధార్, పాన్ కార్డులు అనుసంధానమై ధ్రువీకరణ పూర్తై ఉండాలి. అలాగే భవిష్య నిధి రికార్డుల్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఆధార్‌లోని వివరాలతో పూర్తిగా సరిపోవాలి.

Also Read : గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!

ఈ వివరాల్లో తేడాలు ఉంటే సేవలు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భవిష్య నిధి ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి ఉపసంహరించుకునే అవకాశం మాత్రం లేదన్నారు కేంద్రమంత్రి. ఉద్యోగి భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖాతాలోని కొంత మొత్తం శాశ్వతంగా భద్రపరుస్తారు. మిగిలిన అర్హత ఉన్న భాగాన్ని మాత్రమే సభ్యులు యూపీఐ ద్వారా పొందగలరు. సభ్యుల సేవలను మరింత సులభతరం చేయడానికి భవిష్య నిధి సంస్థ త్వరలో వాట్సాప్ ఆధారిత సమాచార సేవను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సభ్యులు తమ ఖాతా నిల్వ, ఉపసంహరణ అర్హత, దరఖాస్తుల స్థితి వంటి వివరాలను కేవలం ఒక సందేశంతో తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ చర్యలతో భవిష్య నిధి వ్యవస్థను పూర్తిగా డిజిటల్, పారదర్శక, వేగవంతమైన సేవా వేదికగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్