Thursday, September 17, 2026 11:38 PM
Thursday, September 17, 2026 11:38 PM

ఏపీ ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో GST వసూళ్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మళ్లీ కళకళలాడుతోంది. రాష్ట్ర ఆదాయం రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. 2026 మే నెలలో రాష్ట్ర పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఏకంగా 19 శాతం వృద్ధితో రూ.4,950 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో రూ.4,165 కోట్లు వసూలు కాగా, ఈసారి అదనంగా రూ.737 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ అంశంపై ది హిందూ పత్రిక ప్రత్యేక కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆన్ ఫైర్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Also Read : గెట్ రెడీ ఫర్ ఐ మ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్..!

వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ. సోమవారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం..GST వసూళ్లు 16 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు చేరుకున్నాయి. 2025 మే నెలలో ఇవి రూ.2,629 కోట్లుగా ఉన్నాయి. అలాగే, IGST సెటిల్మెంట్ ద్వారా రాష్ట్రానికి రూ.1,758.58 కోట్లు వచ్చాయి (గతేడాదితో పోలిస్తే 15.36% వృద్ధి). ఇక పెట్రోలియం ఉత్పత్తుల వ్యాట్ ఏకంగా 31.79 శాతం పెరిగి రూ.1,768.82 కోట్లకు చేరడం విశేషం. Professional Tax ద్వారా రూ.48.92 కోట్లు, మద్యం వ్యాట్ ద్వారా రూ.89 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి.

GST వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక (17%) తర్వాతి స్థానంలో నిలిచి రెండో ప్లేస్ కైవసం చేసుకుంది. కేరళ (15%), తెలంగాణ (14%), తమిళనాడు (12%) రాష్ట్రాలు ఏపీ తర్వాతి స్థానాల్లోనే ఆగిపోయాయి. పెట్రోలియం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ మెషినరీ, బులియన్, జ్యువెలరీ రంగాల్లో లావాదేవీలు పెరగడమే ఈ రికార్డు వసూళ్లకు కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.

Also Read : యుద్ధ భూమిలో లోకేష్ పెట్టుబడుల వేట..!

మరోవైపు పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్వాయిస్‌లను అరికట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ టెక్నాలజీకి పెద్దపీట వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడటం, వివిధ శాఖల డేటాను అనుసంధానం చేయడం ద్వారా పన్నుల లీకేజీని అరికట్టగలిగారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ డిజిటల్ వ్యవస్థలను, ఆటోమేటెడ్ మానిటరింగ్ విధానాలను మరింత బలోపేతం చేయాలని వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్