Thursday, September 17, 2026 11:35 PM
Thursday, September 17, 2026 11:35 PM

పెద్దికి షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్ట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పెద్ది.. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం టాలీవుడ్‌లో సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ ను చిత్ర యూనిట్ తెలంగాణ హైకోర్టు నుండి అనూహ్యంగా విత్ డ్రా చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా బిజినెస్ సమీకరణాల నేపథ్యంలో రేట్ల పెంపు కోసం నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు కోర్టులో బ్రేక్ పడింది.

Also Read : కుల పిచ్చి దాటడమే పవన్ లక్ష్యమా..?

సినిమా విడుదలై మొదటి వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పెద్ది.. చిత్ర నిర్మాతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. గతంలో సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారాలపై కోర్టు ఇచ్చిన తీర్పులను, ప్రభుత్వ నిబంధనలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పాత తీర్పులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు ఎలాంటి ప్రత్యేక సానుకూల ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read : గోదావరి జిల్లాల్లో మళ్లీ టైగర్ టెన్షన్..!

కోర్టు అభిప్రాయాన్ని గమనించిన చిత్ర యూనిట్, తమ పిటిషన్‌ ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి స్పష్టం చేస్తూ ఉపసంహరించుకుంది. టికెట్ ధరల లీగల్ వివాదానికి తాత్కాలికంగా తెరపడటంతో, పెద్ది.. సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతోంది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. హైకోర్టులో పిటిషన్ విత్‌ డ్రా చేసుకున్న నేపథ్యంలో, సాధారణ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సినిమా టికెట్ల విక్రయాలు సాగనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్