Friday, September 18, 2026 02:01 AM
Friday, September 18, 2026 02:01 AM

కొడుకు కోసం మాజీ సీఎం ఆరాటం..!

కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై అధిష్టానంతో చర్చల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కీలక భేటీ ముగిసిన అనంతరం, సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడ కేబినెట్ స్థానాలు, సామాజిక సమీకరణాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖరారైన సంగతి తెలిసిందే.

Also Read : సెక్స్ వర్కర్లపై పోలీసు దాడులపై సుప్రీం సంచలన తీర్పు..!

ఇక ఈ చర్చల్లో భాగంగా సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రకు నూతన కేబినెట్‌ లో కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. యతీంద్రకు విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కేటాయించాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సిద్ధరామయ్య గట్టిగానే పట్టుబడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరలేపుతోంది.

Also Read : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో సంచలనం..!

కర్ణాటక నూతన కేబినెట్‌ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. ఇందులో లింగాయత్ సామాజికవర్గం నుంచి ఒకరికి, ఎస్సీ సామాజికవర్గం నుంచి మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం రేసులో నలుగురు ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే, ఎం.బి.పాటిల్, మరియు జర్కిహోళి ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్