Wednesday, July 22, 2026 04:17 AM
Wednesday, July 22, 2026 04:17 AM

చక్రం తిప్పిన మెగా.. డిప్యూటీ సీఎంకు చెడ్డపేరు..!

ఆ ఒక్క ఘటనే, డిప్యూటీ సీఎం ప్రతిష్టను మంట గలిపిందా..?. ఏపీ సచివాలయంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సచివాలయంలో అనేక మంది మంత్రులు కన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కే , నిజాయతీతో పాటు పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నది వాస్తవం. సమర్ధతతో పాటు నిజాయతీ కూడా పుష్కలంగా ఉన్నాయనేది ప్రభుత్వంలో బాగా వినిపిస్తున్న మాట. అయితే ఒకే ఒక ఆర్ధిక పరమైన నిర్ణయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఇన్‌ఛార్జ్ మహిళా ఈఎన్‌సీ తీసుకుని 50 రోజులు దాటిపోయింది. అయినా కూడా ఆ అధికారిణి పై ఇంతవరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారంటే.. ఆమె ఎంతో పవర్ ఫుల్ అయి ఉండాలి..? లేదా వివిధ వర్గాల ఒత్తిళ్లకు పవన్ కళ్యాణ్ కూడా తలోగ్గి ఉండాలనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : అధికారం కోసం విధ్వంసం.. గులాబీ నేత అసలు రూపం..!

రెండు సంవత్సరాల పదవీ కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలతో పాటు నిజాయతిని కూడా శంకించే పరిస్థితులు తాజాగా తలెత్తాయి. తప్పులు చేసిన వారు తప్పుకుంటున్నారు. తప్పు చేయని వారు తలెత్తుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మహిళా అధికారిణి క్షమించలేని తప్పు చేసి 50 రోజులు గడిచినా.. ఆమె పై ఈగ వాలటం లేదంటే.. ఎక్కడో ఏదో జరిగిందని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. చిన్న, చిన్న కాంట్రాక్టర్‌ల బిల్లులు సుమారు రూ.1,600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీసం సగం మొత్తం అయినా చెల్లించే విధంగా, రూ.700 కోట్లు పైగా ఆర్ధిక శాఖ విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించమని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

సచివాలయంలోని రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్.. ఆర్‌డబ్ల్యూఎస్ఎస్ శాఖ కూడా ముందు పెండింగ్ బిల్లులు చెల్లించమని ఆదేశించింది. డిప్యూటీ సీఎం కూడా ప్రత్యేకంగా ఇదే విషయం చెప్పారు. కానీ ఆర్‌డబ్ల్యూఎస్ఎస్ శాఖ ఇన్‌ఛార్జ్ ఈఎన్‌సీ ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా.. ఒక బడా, మెగా కాంట్రాక్టర్‌కు రూ.650 కోట్ల రూపాయలను మొబిలైజేషన్ అడ్వాన్స్.. అంటే చేయబోయే పనులకు ముందస్తు అడ్వాన్స్.. కింద చెల్లించారు. ఇలా జరిగి 50 రోజులు దాటినా కూడా.. ఆమె పై కఠిన చర్యలు తీసుకోకుండా ఆమె నిర్వహిస్తున్న ఇన్‌ఛార్జ్ ఈఎన్‌సీ పోస్టును రెగ్యులర్ ఈఎన్‌సీగా మార్చేందుకు పావులు కదుపుతున్నారు కూడా.

Also Read : ట్రెడ్‌ మిల్‌ పై వాకింగ్ మంచిదా..? రన్నింగ్ మంచిదా..?

రెండేళ్లుగా నిజాయతీగా పని చేస్తున్నారనే పేరున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యామ్ సొంత శాఖలోనే ఇలాంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూంటే ఆశ్చర్యంగా ఉందని.. అటు చిన్న కాంట్రాక్టర్‌లు, ఇటు ఆ శాఖ అధికారులు, ఇంజనీర్లు కామెంట్లు చేస్తున్నారు. రూ.650 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో చెల్లించడం అనేది ఒకరి వల్ల జరిగే పని కాదని.. ముఖ్యులందరికీ తెలిసే ఈ చెల్లింపు జరిగి ఉటుందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రూ.650 కోట్ల చెల్లింపును ఇన్‌ఛార్జ్ ఈఎన్‌సీ సొంతం చేసేంత ధైర్యం ఉంటుందా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఓ పధకం ప్రకారం.. సదరు మెగా కాంట్రాక్టర్ తెర వెనకుండి నడిపించి ఉంటారనే అనుమానాలున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్