Wednesday, July 22, 2026 07:24 AM
Wednesday, July 22, 2026 07:24 AM

నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు..?

ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇటీవల కాలంలో బాగా దిగజారిపోయారని, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని, తనకు తాను మేధావి అని ఫోజులు కొడుతున్నారని, మతిమరుపు రావడంతో హద్దులు మీరి మాట్లాడుతూ ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణకు చెందిన మేధావులు, న్యాయవాదులు తప్పు పడుతున్నారు.నిజానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ప్రస్తుతం నాగేశ్వర్‌కు లేదు. కూటమిలో వేలు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నది కాదనలేని సత్యం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయమని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

Also Read : ఏపీ మైనింగ్ కుంభకోణంపై ఈడీ గురి..? అరెస్ట్ లు ఖాయమా..?

అమిత్ షాను పవన్ అడిగిన సమయంలో దగ్గరుండి చూసినట్లుగా.. పవన్ కళ్యాణ్‌ను అమిత్ షా తిట్టినట్లు పెద్ద కథ కూడా అల్లారు నాగేశ్వర్. ఈ వ్యాఖ్యలు జనసైనికులకు ఆగ్రహం తెప్పించాయి. పవన్ కళ్యాణ్ పార్టీ ఉనికికి ప్రమాదంగా మారాయి. పవన్ కళ్యాణ్‌ను చులకన చేసి మాట్లాడినట్లు ఆ పార్టీ కార్యకర్తలు భావించి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఆ తర్వాత తీరిగ్గా బయటకు వచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా కేసులు పెట్టడంపై కొందరు విమర్శలు చేశారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణాత్మక జర్నలిస్టుగా భావించి తన అభిప్రాయాలు తెలియజేయవచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే మాదిరిగా ఉండకూడదు. విమర్శిస్తే అన్ని రాజకీయ పార్టీలను, వారు అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఎత్తి చూపిస్తూ విమర్శించాలి. అంతే కానీ.. ఏకపక్షంగా వ్యవహరించకూడదు. ఎవరైనా విమర్శిస్తే.. వాటిని సద్విమర్శలుగా తీసుకోవాలి. అంతే తప్ప విమర్శించిన వాళ్లందర్నీ వ్యతిరేకులుగా భావించకూడదు. మన తప్పులు ఎత్తి చూపించేవాడు మన మిత్రుడు, మనల్ని పొగిడేవాడు మన శత్రువు.. అనేది పెద్దల మాట. ఎవరు అవునన్నా.. కాదన్నా సరే.. నాగేశ్వర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. మేధావిగా, విశ్లేషకునిగా మంచి పేరు ఉంది. పైగా చూపు లేకపోవడంతో.. ఆయన పట్ల సానుభూతి కూడా ఉంది. అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టడం వల్ల ప్రజల్లో ఆయా పార్టీలపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది.

Also Read : అఖిల్ కెరీర్ మార్చే సినిమా ఇదేనా?

నాగేశ్వర్ జనసేన పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నాగేశ్వర్ కుమార్తె వివాహం విశాఖపట్నంలో జరిగింది. పెళ్లి ఖర్చులను వైసీపీ నేతలే భరించారని.. ఆ విశ్వాసంతోనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీ నుంచి జనసేనను వేరు చేయాలనే కుట్రలు చేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. ఇందుకు నాగేశ్వర్‌ను వైసీపీ పావుగా ఉపయోగించుకుంటుందనేది జనసైనికుల మాట. నిజానికి అన్ని తెలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న నాగేశ్వర్ ఒక మాట అనే ముందు దాని పర్యవసానాలు ఆలోచించాలి. ఒక పార్టీపై ఏకపక్షంగా ఆరోపణలు చేయకూడదు. తెలిసినంత వరకే చెప్పాలి. తెలియని విషయాల జోలికి పోయి.. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకూడదు

మేధావి అనే వ్యక్తి ఎవరికీ కొమ్ము కాయకూడదు. ఆత్మగౌరవం చంపుకోకూడదు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత.. అనూహ్యంగా ఆంధ్ర, తెలంగాణ అంటూ విచిత్రమైన వాదన తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ వ్యక్తిపై ఆంధ్ర నాయకుల పెత్తనం అంటూ వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లో ఉంటూ.. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆంధ్ర నాయకులతో పనేమిటీ..? అనే ప్రశ్నకు మాత్రం ఎవరూ జవాబు చెప్పటం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే.. అక్కడ భాష, ప్రాంతీయ బేధాలు చూడకూడదు. నాగేశ్వర్ లాంటి వ్యక్తి అనాలోచితంగా వ్యాఖ్యలు చేశారంటే.. అంత సులువుగా ఎవరూ నమ్మరు. దీని వెనుక ఎవరున్నారనే విషయం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్