Thursday, May 28, 2026 09:22 PM
Thursday, May 28, 2026 09:22 PM

పెద్ది క్లైమాక్స్‌ లో మైండ్ బ్లోయింగ్ సీన్.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ..!

గ్లోబల్ స్టార్ రాం చరణ్.. కొత్త డైరెక్టర్ బుచ్చిబాబు.. కాంబినేషన్‌ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రెంట్స్, టికెట్ ధరల వివాదం మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్‌ కు సంబంధించి ఫిల్మ్‌ నగర్ సర్కిల్స్ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ గాసిప్ బయటకు వచ్చింది.

Also Read : పెద్ది కోసం మళ్లీ పాత పద్ధతి..!

ఈ గాసిప్ ప్రకారం.. పెద్ది సినిమా క్లైమాక్స్ కేవలం రొటీన్ ఫైట్ లేదా విలన్‌ ను చంపడంతో ముగిసిపోదట. 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో.. రామ్ చరణ్ ఒక పవర్‌ ఫుల్ పెహిల్వాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా అంతా తన ఊరి ప్రజల కోసం, వారి ఆత్మగౌరవం కోసం పోరాడే చరణ్ క్యారెక్టర్.. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ లో అత్యంత భయంకరమైన రౌద్ర రూపాన్ని చూపిస్తుందట. విలన్ సామ్రాజ్యంపై చరణ్ తిరగబడే ఆఖరి 20 నిమిషాల ఎపిసోడ్‌ ను బుచ్చిబాబు హాలీవుడ్ రేంజ్‌ లో డిజైన్ చేసినట్లు టాక్.

Also Read : మోదీ సర్కార్‌కు పుష్కరం.. బీజేపీ భారీ ప్లానింగ్..!

ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చే ఇంటెన్స్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, చరణ్ మాస్ మేనరిజమ్స్ థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ఇన్సైడ్ రిపోర్ట్. ఆ సీన్ లో వచ్చే ఒక ఎమోషనల్ ఫ్లాష్‌ బ్యాక్ లింక్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తూనే గూస్‌ బంప్స్ తెప్పిస్తుందట. ఈ గాసిప్‌ కు తోడు మరో సంచలన వార్త కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ ముగిసే ముందు.. కథను ఎండ్ చేయడానికి లేదా నెక్స్ట్ లెవెల్‌ కు ఎలివేట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ గానీ, లేదా ఒక పవర్‌ ఫుల్ క్యామియో అప్పీరెన్స్ గానీ ఉండే అవకాశం ఉందట. ఇండస్ట్రీ పెద్దగా ఈ సినిమా థియేటర్ ఇష్యూస్‌ ను చిరంజీవి స్వయంగా పరిష్కరించడంతో, ఈ గాసిప్‌కు మరింత బలం చేకూరింది. ఒకవేళ క్లైమాక్స్ లో మెగాస్టార్ ఎంట్రీ లేదా వాయిస్ నిజమైతే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్లే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కష్టపడిన వారికి గుర్తింపు...

వైసీపీ ఐదేళ్ల పాలనలో చాలా మంది...

అధికారం కోసం విధ్వంసం.....

బాల్క సుమన్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్...

ఏపీ మైనింగ్ కుంభకోణంపై...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

విరాళంలో వేమిరెడ్డి దంపతుల...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

2029 ఎన్నికల పై...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో...

మోదీ సర్కార్‌కు పుష్కరం.....

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో...

పోల్స్