Thursday, May 28, 2026 12:01 AM
Thursday, May 28, 2026 12:01 AM

పెద్ది కోసం మళ్లీ పాత పద్ధతి..!

దాదాపు 17 ఏళ్ల తర్వాత ‘పెద్ది’లో ఢిల్లీఎపిసోడ్‌ కోసం మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించామని ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు తెలిపారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ఇది. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను రత్నవేలు పంచుకున్నారు.

Also Read : బాలీవుడ్ ను రంగంలోకి దించుతున్న కొరటాల..!

‘పెద్ది’ దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని తెలిపారు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కానీ, ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఊహా ప్రపంచం. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి? విజువల్‌గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశామన్నారు. విజయనగరం క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ ఇలా ఒక్కో అంశాన్ని వరల్డ్ బిల్డింగ్ చేస్తూ వెళ్లామన్నారు. కొండ ప్రాంతాలు, అక్కడి ప్రజలు, వారి లైఫ్ స్టయిల్ ఇలా ప్రతిదీ చాలా సహజంగా ఉంటుందన్నారు. పెద్ది లో తనకు అత్యంత కష్టంగా అనిపించింది క్రికెట్ మ్యాచ్ అని చెప్పారు రత్నవేలు. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్‌తో పాటు మొత్తం టీమ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు అని వెల్లడించారు.

క్రికెట్ మ్యాచ్‌ను రాత్రిపూట షూట్ చేద్దామని బుచ్చిబాబుకప సూచించినట్లు తెలిపిన రత్నవేలు.. 80లలో ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందని అనిపించిందన్నారు. ఈ ఆలోచన బుచ్చిబాబుకు కూడా నచ్చిందన్నారు. అలాగే కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ, ఇందులో రామ్ చరణ్ కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్‌పై వర్క్ చేశారని.. ప్రతి మజిల్‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్‌లా కనిపించారన్నారు. హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉందన్నారు. ఆ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేసినట్లు రత్నవేలు వెల్లడించారు. అది థియేటర్‌లో చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయని.. ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు.

Also Read : తాడేపల్లి నుంచి జగన్ ఫ్యూచర్ ప్లాన్.. సక్సెస్ అవుతుందా..!

ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదంటూ సినిమాపై ఆసక్తిపై పెంచారు రత్నవేలు. ప్రేక్షకులకు ఈ సినిమా కన్నుల పండుగలా ఉంటుందని.. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుందన్నారు. చివరి 30 నిమిషాలు ప్రేక్షకులని ఈ సినిమా కదిలిస్తుంది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన సన్నివేశాలు తనకు చాలా ఫేవరెట్ అన్నారు. అక్కడ లైట్ లేకుండా షూట్ చేసినట్లు తెలిపారు. దాని కోసం ఫిల్మ్ నెగటివ్‌ను వాడామన్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించినట్లు రత్నవేలు తెలిపారు. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్‌పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం వాడినట్లు చెప్పుకొచ్చారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యిందని.. ఏడాదికి ఒక సినిమానే చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు కథలను తాను రాసినట్లు తెలిపిన రత్నవేలు.. మంచి ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌ను డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘పెద్ది’లో ఒక కుస్తీ ఫైట్‌కు తన కుమారుడు షూట్ చేసినట్లు రత్నవేలు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

2029 ఎన్నికల పై...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో...

మోదీ సర్కార్‌కు పుష్కరం.....

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో...

మన టార్గెట్.. జెన్...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

సిద్దు అవుట్.. డీకే...

కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటకలో అధికారంలో...

తాడేపల్లి నుంచి జగన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు...

టీపీసీసీ గౌడ్‌కు పొగ.....

ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతుందో...

పోల్స్