Saturday, September 5, 2026 12:21 AM
Saturday, September 5, 2026 12:21 AM

హిందూ ఓటర్లను వదిలేద్దాం.. వైసీపీ తెలివిగా ఆడుతోందా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం ఒక పెద్ద పొలిటికల్ రచ్చకు దారితీసింది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లను దూషించడం, అతని కార్యాకలాపాల నేపధ్యంలో ఇతన్ని ఉపా చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇక్కడితో ఆగని ఈ వివాదం.. ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. ప్రశ్న రావణ్ కేవలం రాజకీయ నేతలనే కాదు.. గతంలో హిందూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దేశభక్తిని తక్కువ చేస్తూ మాట్లాడాడు.

Also Read : ఆ ముగ్గురి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!

ఇతని పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఇంతటి హిందూ వ్యతిరేక చరిత్ర ఉన్న వ్యక్తికి వైసీపీ బహిరంగంగా లీగల్ సపోర్ట్ ఇవ్వడం, పార్టీ నేతలు అతడి అరెస్ట్‌ ను ఖండించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం దళితులపై, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతోందని చూపించి.. దళిత, మైనారిటీ ఓటర్లలో సానుభూతి పొందాలనేది వైసీపీ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రావణ్ వెనుక వైసీపీ నిలబడింది.

Also Read : కొరియా స్టాక్ మార్కెట్‌ను షేక్ చేసిన లోకేష్..!

కానీ, హిందూ దేవుళ్లను దూషించిన వ్యక్తికి అండగా నిలవడం ద్వారా మెజారిటీ హిందూ ఓటర్లకు వైసీపీ తప్పుడు సంకేతాలు పంపుతోందనే విమర్శలు వస్తున్నాయి. తాజా పరిణామాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సహా ఏపీ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీతారాములను, సనాతన ధర్మాన్ని దూషించిన రావణ్‌ను క్షమించేదే లేదు అని స్పష్టం చేశారు. ఇటువంటి శక్తులకు మద్దతిచ్చే పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తిరుమల లడ్డూ వివాదంతో ఇప్పటికే హిందూ ఓట్లను కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు మళ్లీ ఒక యాంటీ-హిందూ యాక్టివిస్ట్ కోసం తాపత్రయపడటం ఆత్మహత్యాసదృశ్యమేనని, ఆ పార్టీ హిందూ ఓట్లను పూర్తిగా వదిలేసుకున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

పోల్స్