Wednesday, May 20, 2026 12:37 PM
Wednesday, May 20, 2026 12:37 PM

లింక్ డాక్యుమెంట్ల దోపిడీకి సర్కార్ బ్రేక్..!

గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. వంశ పారంపర్యంగా వస్తున్న ఇళ్లు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామకంఠం భూములు వెబ్ లాండ్ రికార్డుల్లో స్పష్టమైన సబ్‌డివిజన్లు లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో 22 ఏ జాబితాలో నమోదయ్యాయి. దీంతో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, బదిలీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పాత ఇళ్లకు లింకు డాక్యుమెంట్లు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది.

Also Read : దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం..!

తాజా ఆదేశాల ప్రకారం గ్రామకంఠం భూములు 22ఏ జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్ చేయవచ్చని స్పష్టం చేశారు. పంచాయతీ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన ఇంటి పన్ను రశీదును ప్రామాణిక పత్రంగా పరిగణించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రశీదును ఆధారంగా తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పన్ను రశీదులు లేని ఖాళీ స్థలాలకు ‘సెల్ఫ్ డిక్లరేషన్’కు అవకాశం కల్పించారు. ఆస్తి వారసత్వంగా వచ్చిందని, తాము అనుభవిస్తున్నామని యజమాని స్వయంగా ధ్రువీకరిస్తే సరిపోతుందని తెలిపారు. ఇందుకోసం రెవెన్యూ అధికారుల నుంచి అదనపు ధ్రువపత్రాలు కోరరాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాలు, పట్టణాల్లోని పాత నివాస ప్రాంతాల ఆస్తుల క్రయ విక్రయాలు వేగవంతం కానుండగా, బ్యాంకు రుణాల పొందడానికీ మార్గం సుగమం కానుంది. ఇప్పటి వరకు 22ఏ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారుల అక్రమాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది.

Also Read : టీ బీజేపీలో భారీ మార్పు.. రంగంలోకి ఈటల..!

రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కోసం కేవలం రూ.100 మాత్రమే ఫీజుగా నిర్ణయించారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన వారసత్వ ఆస్తులకు ఈ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులపై హక్కులు లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో వాటిని అమ్ముకోవడానికి లేదా బ్యాంకు లోన్లు పొందడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్