ఐపీఎల్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం నమోదైంది. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరో 278 ఐపీఎల్ మ్యాచ్ లతో ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును సమం చేశారు. లీగ్ ప్రారంభమైనప్పటి నుండి ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ధోనీతో ఇప్పుడు కోహ్లీ, రోహిత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుత సీజన్ లో వీరిద్దరూ మరిన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం ఉండటంతో, త్వరలోనే ధోనీ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించనున్నారు.
Also Read : మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!
విరాట్ కోహ్లీ ప్రయాణం ఐపీఎల్ లో అత్యంత ప్రత్యేకం. 2008 ప్రారంభ సీజన్ నుండి నేటి వరకు అంటే వరుసగా 19 సీజన్ల పాటు ఒకే జట్టు తరపున ఆడిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. తన కెరీర్ లోని మొత్తం 278 మ్యాచ్ లను కోహ్లీ ఆర్‌సిబి జెర్సీలోనే ఆడటం విశేషం. ఏ జట్టుకైనా ఇంత సుదీర్ఘకాలం ఒకే ఆటగాడు ప్రాతినిధ్యం వహించడం ఐపీఎల్ చరిత్రలో మరెక్కడా కనిపిచదు. మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా 278 మ్యాచ్ లతో ఈ మైలురాయిని అందుకున్నాడు.
Also Read : రైల్వే సొమ్ము నిలువు దోపిడీ..!
రోహిత్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని డెక్కన్ ఛార్జర్స్ తో ప్రారంభించి అక్కడ 46 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత 2011లో ముంబై ఇండియన్స్ లో చేరిన రోహిత్, ఆ జట్టు తరపున ఏకంగా 232 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. ముంబై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందిన రోహిత్, ఇప్పుడు అత్యధిక మ్యాచ్ ల రికార్డులోనూ టాప్ లో నిలిచాడు. ఇక ఈ రికార్డుకు మూలస్థంభమైన ఎంఎస్ ధోనీ కూడా 278 మ్యాచ్‌లతో వీరితో సమానంగా ఉన్నాడు. ధోనీ తన కెరీర్ లో ఎక్కువ మ్యాచ్ లను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడగా, సిఎస్కేపై నిషేధం ఉన్న సమయంలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరపున కూడా ప్రాతినిధ్యం వహించాడు.

