ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ఐపీఎల్ స్వరూపాన్ని సమూలంగా మార్చేందుకు బీసీసీఐ భారీ ప్రణాళికలు రచిస్తోంది. 2028 సీజన్ నుంచి టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్యను ఏకంగా 94కి పెంచాలని, పది జట్లకు పూర్తిస్థాయిలో “హోమ్ అండ్” అనే ఫార్మాట్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు ద్వారా టోర్నీని మరింత ఆకర్షణీయంగా, అభిమానులకు మరింత సులభంగా అర్థమయ్యేలా చేయాలన్నది బోర్డు ప్రధాన ఉద్దేశం.
Also Read : ఏపీలో ఇక 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్..!
ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 జట్లు ఉన్నప్పటికీ, ‘వర్చువల్ గ్రూప్’ విధానం అమలవుతోంది. దీనివల్ల ప్రతి జట్టూ అన్ని జట్లతో రెండేసి సార్లు తలపడటం లేదు. ఈ గందరగోళానికి తెరదించి, పాత పద్ధతిలో ప్రతి జట్టూ మిగిలిన తొమ్మిది జట్లతో రెండేసీ మ్యాచ్‌లు.. ఒకటి సొంత స్టేడియం, మరొకటి ప్రత్యర్థి గడ్డపై ఆడేలా కొత్త ఫార్మట్ తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ విధానంలో ప్రతి జట్టు లీగ్ దశలో 18 మ్యాచ్‌లు ఆడుతుంది. దీంతో టోర్నీ మొత్తం మ్యాచ్‌ల సంఖ్య ప్రస్తుత 74 నుంచి 94కి పెరుగుతుంది. ఈ ప్రణాళికలను ఐపీఎల్ ఛైర్మన్ ఆరుణ్ ధుమాల్ స్వయంగా ధ్రువీకరించారు.
మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, కొత్త ఫ్రాంచైజీలను చేర్చే ఆలోచన లేదని అరట్ ధుమాల్ స్పష్టం చేశారు. “ప్రతి జట్టుకు సమానంగా హోమ్, అవే మ్యాచ్‌లు కల్పించాలంటే, మనం 74 నుంచి 94 మ్యాచ్‌ల వరకు వెళ్లవచ్చు. అయితే, జట్ల సంఖ్యను మాత్రం పదికి పరిమితం చేస్తామని వివరించారు. టోర్నీలో నాణ్యతను కాపాడటం, దేశీయ ప్రతిభావంతుల కొరత ఏర్పడకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : సీఎం సచివాలయంలో ఉండగా.. భయపెట్టిన ప్రచారం..!
ఈ ప్రణాళిక అమలుకు అతిపెద్ద అడ్డంకి ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్. 2027 వరకు ఉన్న ప్రస్తుత క్యాలెండర్‌లో 94 మ్యాచ్‌ల టోర్నీకి సరిపడా సమయం లేదు. ఈ అదనపు 20 మ్యాచ్‌ల కోసం సుమారు మూడు వారాల సమయం అదనంగా అవసరమవుతుంది. అందువల్ల తదుపరి ఐసీసీ సైకిల్‌లో ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రెండున్నర నెలల విండోను సాధించడంపై బీసీసీఐ దృష్టి సారించనుంది.
కొన్ని సీజన్లుగా టోర్నీ మధ్య భాగంలో.. “మిడ్-లీగ్ ఫెటీగ్” ప్రేక్షకుల్లో ఆసక్తి కొద్దిగా తగ్గుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. గ్రూపుల విధానంలోని పాయింట్ల పట్టిక గందరగోళంగా ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. అదే ఫుట్‌బాల్ తరహా సింగిల్ లీగ్ టేబుల్ అయితే, ప్రతి మ్యాచ్‌లో ప్రాధాన్యం పెరుగుతుంది. అభిమానులు కూడా చివరి వరకు ఆసక్తిగా టోర్నీని అనుసరిస్తారు. ఈ వ్యూహాత్మక మార్పు వాణిజ్యపరంగా కూడా ప్రసారకర్తలకు, వాటాదారులకు ప్రయోజనాలు చేకూరుస్తుందని బీసీసీఐ అంచనా చేస్తోంది.

