Tuesday, June 23, 2026 04:54 PM
Tuesday, June 23, 2026 04:54 PM

విజయ్.. ప్రతిరోజూ కత్తి మీద సామే..!

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత నాటకీయ పరిణామాల మధ్య విజయ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. మొత్తానికి ఈరోజు ఉదయం వైభవంగా 9 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగించారు. అయితే ఇక్కడే విజయ్‌ను కొన్ని ప్రశ్నలు పెద్ద ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. విజయ్ సర్కార్‌కు ఇది కత్తి మీద సాము లాంటిది. ఇంకా చెప్పాలంటే.. దిన దిన గండం.. నూరేళ్లు ఆయుషూ అన్నట్లుగా.. ఐదేళ్లు అధికారంలో ఉండటమే పెద్ద అనుమానం.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు పొత్తులతో పాటు ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీలు కూడా కారణమంటున్నారు.

Also Read : బీజేపీలోకి కొడాలి నాని.. నిజమేనా..?

విజయ్ సారధ్యంలోని టీవీకే పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి బొటాబోటి మెజారిటీ ఉంది. టీవీకే పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 108 మాత్రమే. ఇందులో విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఆ స్థానంలో టీవీకే అభ్యర్థి పోటీ చేసి గెలిస్తే.. 108 మంది. అంటే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా పది మంది తక్కువే. ఇక విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు, సీపీఐ, సీపీఎం నుంచి గెలిచిన నలుగురితో పాటు వీసీకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అండగా ఉన్నారు. అయితే ఇక్కడే అసలు తిరకాసు ఉంది. సీపీఐ, సీపీఎంకు చెందిన నలుగురు బయట నుంచే మద్దతు ఇస్తారని తేల్చేశారు. ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాబోమని.. టీవీకే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ మద్దతు చివరి వరకు ఉంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. టారిఫ్ లపై కోర్టు కీలక తీర్పు..!

ఇక వీటితో పాటు విజయ్‌కు అతి పెద్ద సవాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు. హామీల అమలుకు నిధులు సమీకరణ కోసం ఓ పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు విజయ్ ముందు ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులతో ఉందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సరే.. ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా.. ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారు. అవే ఇప్పుడు కొండలా కనిపిస్తున్నాయి. పుట్టిన బిడ్డకు 2 గ్రాముల బంగారు ఉంగరం అన్నారు. పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం ఇస్తారట. 60 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2,500 రూపాయలు, ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇక వీటితో పాటు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండనే ఉంది. వీటికి ప్రతి ఏటా లక్షల కోట్ల నిధులు కావాలి. వీటి సమీకరణతో పాటు భాగస్వామ్య పక్షాలను సంతోష పెట్టడం, కంట్రోల్ చేయడం నిప్పుల మీద నడకే. మొత్తానికి తమిళనాడులో అణు ప్లాంట్ మీద విజయ్ నడక సాగనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పోల్స్