Tuesday, June 23, 2026 07:29 PM
Tuesday, June 23, 2026 07:29 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్.. మరణం ఖాయమా..?

కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం మరువకముందే ప్రపంచాన్ని హంటా వైరస్ రూపంలో మరో కొత్త ఆందోళన చెమటలు పట్టిస్తుంది. అర్జెంటీనా నుంచి స్పెయిన్‌ కు ప్రయాణిస్తున్న ఒక విలాసవంతమైన నౌకలో ఈ వైరస్ కేసులు బయటపడటంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో సుమారు ఏడుగురికి వైరస్ సోకగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Also read : కల్తీ నెయ్యి కేసులో మరో కమిటీ..!

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రస్తుతం ఈ నౌకను పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వెర్డ్ సమీపంలో నిలిపివేసి, కఠినమైన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అయితే, ఈ వైరస్ లక్షణాలు బయటపడకముందే కొంతమంది పర్యాటకులు నౌక నుంచి దిగి యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాలు తమ వద్దకు వచ్చిన ప్రయాణికులను గుర్తించి, వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. నౌకలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం అందడంతో వారి క్షేమసమాచారంపై ఆరా తీస్తున్నారు.

Also read : బీజేపీలోకి కొడాలి నాని.. నిజమేనా..?

హంటా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు వాంతులు, విరేచనాలు వంటి జీర్ణకోశ సమస్యలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ వైరస్‌ కు ప్రత్యేకమైన చికిత్స లేదా టీకా అందుబాటులో లేకపోవడం, మరియు మరణాల రేటు సుమారు 38% ఉండటం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకలు మరియు ఇతర రోడెంట్ల ద్వారా వ్యాపిస్తుంది. వాటి విసర్జితాలు లేదా లాలాజలంతో కలిసిన గాలిని పీల్చడం వల్ల మానవులకు ఇది సోకుతుంది. ప్రస్తుతం నౌకలో బయటపడిన ఆండీస్ స్ట్రెయిన్ చాలా అరుదుగా ఒక మనిషి నుంచి మరొక మనిషికి కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాపులకు జగన్ నమ్మకద్రోహం.....

ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో...

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

పోల్స్