Saturday, April 25, 2026 07:38 PM
Saturday, April 25, 2026 07:38 PM

పాకిస్థాన్‌లో ట్రంప్ టీమ్.. ఇరాన్‌ తో మళ్లీ చర్చలు..!

ద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగు పడింది. శనివారం పాకిస్థాన్ వేదికగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరపడానికి అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ సిద్ధమయ్యారు. ఈ పర్యటనను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్ ద్వారా ధృవీకరించారు. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పిలుపు మేరకు ఇరాన్ స్పందించింది. ముఖాముఖి చర్చల కోసం వారే ఆహ్వానించారని, అందుకే స్పెషల్ ఎన్వాయ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం ఉదయం పాకిస్థాన్ బయలుదేరుతున్నారు అని తెలిపింది.

Also Read : అమెరికాకు గుడ్ బై అంటున్న ఇండియన్స్..!

ఈ ఇద్దరు అగ్రశ్రేణి సలహాదారులు పాకిస్థాన్‌ లో ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపి, అక్కడి పరిస్థితులపై నేరుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్‌ కు నివేదిక సమర్పిస్తారు. అవసరమైతే ఉన్నత స్థాయి బృందం కూడా పాకిస్థాన్ వెళ్లడానికి సిద్ధంగా ఉందని వైట్ హౌస్ వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ వ్యవహారాల స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ గతంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చల్లో కూడా కీలక పాత్ర పోషించారు.

Also Read : అమెరికా, చైనాలో ఏం జరుగుతోంది..? 20 మంది టాప్ సైంటిస్టుల మాయం..!

ఇప్పుడు జరగబోయే రెండో రౌండ్ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, ఈసారి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్, అలాగే ఇరాన్ తరపున మొదటి రౌండ్‌ లో నేతృత్వం వహించిన మొహమ్మద్ బాఘర్ గలీబాఫ్ ఈ చర్చల్లో పాల్గొనడం లేదు. ఇరాన్‌ తో అప్పట్లో అబ్రహం ఒప్పందం వంటి కీలక డీల్స్ కుదుర్చడంలో జారెడ్ కుష్నర్ సఫలమయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆయన నేరుగా రంగంలోకి దిగడంతో, ఈ చర్చల ద్వారా ఏదైనా భారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉందా..? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

కల్తీ నెయ్యి కేసు.....

కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ అధికారులు...

బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర...

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ...

మంగ్లీ అండ్ టీమ్...

మంగ్లీ, శివ నాయక్, రామావత్ మధు,...

పోల్స్