Friday, September 18, 2026 12:28 AM
Friday, September 18, 2026 12:28 AM

బిసిసిఐపై గౌతమ్ గంభీర్ ఫైర్..? గిల్ పరిస్థితి ఏంటి..?

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన డామినేషన్ కంటిన్యూ చేస్తున్న.. గౌతమ్ గంభీర్ ఇప్పుడు బోర్డు విషయంలో సీరియస్ గా ఉన్నట్లు టాక్. బిసిసిఐ షెడ్యూలింగ్‌ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వరుస సిరీస్‌ లు, తక్కువ వ్యవధిలో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల ఆటగాళ్లపై పడుతున్న వర్క్ లోడ్ ను గంభీర్ సీరియస్ గా తీసుకున్నట్లు టాక్. ముఖ్యంగా త్వరలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్టు కోసం టీమ్ సెలక్షన్ విషయంలో గంభీర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Also Read : పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫేవరేట్ డైరెక్టర్ రీ ఎంట్రీ..!

బిసిసిఐ రూపొందించిన ప్రస్తుత షెడ్యూల్ వల్ల కీలక ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించడం లేదని గంభీర్ భావిస్తున్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో ఫిట్‌నెస్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో, రాబోయే ఏకైక టెస్టు కోసం ప్రధాన ఆటగాళ్లను రిస్క్‌ లో పెట్టకుండా, కేవలం రిజర్వ్ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు జాతీయ మీడియా అంటుంది. ఐపిఎల్ ముగిసిన ఆరు రోజుల్లో ఆఫ్ఘన్ తో టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. అసలు ఐపిఎల్ ప్లే ఆఫ్స్ కు ఎవరు వెళ్తారో తెలియదు.

Also Read : స్లీపర్ బస్సుల నిషేధం సాధ్యమేనా..?

గత నాలుగు నెలలుగా ఆటగాళ్ళు గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అందుకే గంభీర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, కోచ్ గంభీర్ ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నట్లు జాతీయ మీడియా అంటుంది. గిల్ ప్రస్తుతం ఫామ్, ఫిట్‌నెస్ పరంగా కీలక దశలో ఉన్నాడు. ఒకవైపు కీలకమైన టెస్ట్ మ్యాచ్, మరోవైపు ఐపిఎల్ వల్ల ఎదురవుతున్న అలసట.. ఈ రెండింటి మధ్య గిల్ ను ఆడించాలా వద్దా..? అనే సందిగ్ధంలో మేనేజ్‌మెంట్ ఉంది. గంభీర్ తన దూకుడు స్వభావంతో షెడ్యూలింగ్‌ను ప్రశ్నిస్తుంటే, గిల్ మాత్రం జట్టు ప్రయోజనాల కోసం మైదానంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్