ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే.. అమరావతి అనే సమాధానం ఠక్కున వస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2027 జూన్ నాటికి అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి కూడా. అయితే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై రైతులు అనుమానం వ్యక్తం చేయడంతో.. భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ఏప్రిల్ ఒకటిన పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని.. ఆ రోజు “అమరావతి” రాజధానిగా పార్లమెంట్‌లో కేంద్రం ఆమోదం అయిన వెంటనే రాష్ట్రం అంతటా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కూడా.
Also Read : ధర్నా వ్యవహారంపై సిఎం ఆరా.. షాక్ అయిన అధికారులు..!
అమరావతికి చట్టబద్ధమైన హోదాపై శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం, కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత, ఏప్రిల్ ఒకటిన పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ తీర్మానం ఆమోదం పొందితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని సెక్షన్ 5ను సవరించడానికి ఉద్దేశించిన ఈ చట్టం, అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా అధికారికంగా ప్రకటించినట్లు అవుతుంది. దీని ద్వారా ఏళ్ల తరబడి నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడుతుంది కూడా.
Also Read : అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎస్పీ..!
ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో సాధారణ మెజారిటీతోనే ఆమోదం లభిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు చాలా సులభంగానే ఆమోదం పొందుతుంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. అసలు ప్రశ్న ఏమిటంటే.. తీర్మానం ఆమోదం సమయంలో అసెంబ్లీని బహిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమరావతికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటు వేస్తుందా.. లేదా అనేది పెద్ద ప్రశ్న. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు రాజధాని అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయడం, ప్రజా వ్యతిరేకతను తగ్గించడంపై వైసీపీ నాయకత్వం అంతర్గతంగా చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో ముగిసిన మావోల శకం.. ఆపరేషన్ కగార్ సక్సెస్..!
పార్టీలో తీసుకున్న నిర్ణయం మేరకు.. వైసీపీ ఎంపీలు పార్లమెంటరీ చర్చల సందర్భంగా ఒక సున్నితమైన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధిలో జరిగిన రెండు అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, అమరావతిని రాజధానిగా సమర్థించాలని నిర్ణయించారు. అమరావతిని రాజధానిగా చేసేందుకు తాము వ్యతిరేకం కాదని, మూడు రాజధానుల ప్రతిపాదన 2024కి ముందు ఎన్నికల సందర్భానికి మాత్రమే పరిమితమైన అంశమని పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చనే సూచనలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ శాసన ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

