Friday, October 9, 2026 04:46 AM
Friday, October 9, 2026 04:46 AM

ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత విద్యార్థులకు చుక్కలు..!

ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం.. కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధాలుగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్థులు భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, వీసా నిబంధనలు వారి కెరీర్‌ ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Also Read : మళ్ళీ దొరికిపోయిన ధనుష్, మృణాల్..?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న తరుణంలో, యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన వీసా నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిరసనల్లో పాల్గొన్న లేదా యుద్ధానికి వ్యతిరేకంగా గళం ఎత్తిన కొంతమంది విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, వారిని వెనక్కి పంపించే అంశాలపై చర్చ జరుగుతుండటం విద్యార్థులను భయపెడుతోంది. యుద్ధం కారణంగా అమెరికాలో ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం కనపడుతోంది. అదే విధంగా యుద్ధం కారణంగా పశ్చిమాసియా గగనతలం మూసివేయడం కూడా ప్రభావం చూపుతోంది.

దీనివల్ల అమెరికా నుండి భారత్‌కు వచ్చే విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో కంటే ఎక్కువ సమయం ప్రయాణించాల్సి రావడంతో విద్యార్థులు అత్యవసరంగా ఇంటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. అమెరికాలో ధరలు పెరిగిపోవడం కూడా విద్యార్ధులపై ప్రభావం పడుతోంది.

Also Read : వైసీపీలో చెవిరెడ్డి శకం ముగిసినట్లే..? లిక్కర్ కేసు తర్వాత మారిన సీన్..!

పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వారికి ధరలతో చుక్కలు కనపడుతున్నాయి. ఇది అమెరికాలోని ఐటీ మరియు ఇతర రంగాల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులు కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేస్తాయేమోనని భయపడుతున్నారు. యుద్ధ సమయంలో అమెరికాలోని పలు యూనివర్సిటీల వద్ద భద్రత పెంచినప్పటికీ, జాతి వివక్ష లేదా విద్వేషపూరిత దాడులు జరుగుతాయేమోనన్న భయాందోళనలు విద్యార్థుల్లో ఉన్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్