Monday, March 30, 2026 04:17 PM
Monday, March 30, 2026 04:17 PM

ఒక్క కార్టూన్‌కే భయపడితే ఎలా..?

ఒక్క కార్టూన్‌కే భయపడితే ఎలా..? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి కూడా వైసీపీ దూరంగా ఉంది. చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కూడా లేరు. బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లో ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. తాము అమరావతికి వ్యతిరేకం కాదని.. అమరావతి పేరుతో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని.. దీనిపై మండలిలో కూడా చర్చించాలని ప్రెస్ మీట్‌పెట్టి ఆరోపణలు చేశారు. అంతే తప్ప.. అసెంబ్లీకి వచ్చి.. అమరావతికి తాము అనుకూలం అనే మాట మాత్రం చెప్పలేదు.

Also Read : భారతీ సిమెంట్స్ కు షాక్ తప్పదా..?

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ – గుంటూరు మధ్యలోని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి.. దానికి అమరావతి అని పేరు పెట్టారు. ఈ ఎంపికపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరించారు. అలాగే అసెంబ్లీలో కూడా చర్చించారు. ఆ చర్చలో ప్రతిపక్ష నేత హోదాలో పాల్గొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజధాని నిర్మాణానికి కనీసం 30 వేల నుంచి 50 వేల ఎకరాలు కావాలన్నారు కూడా. ఇక 2019 ఎన్నికల ప్రచారంలో అయితే.. అమరావతి సమీపంలోనే తన ఇల్లు ఉందని.. రాజధానికి తాను పూర్తి అనుకూలమని కూడా ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన జగన్.. అమరావతి బదులుగా మూడు రాజధానులంటూ వింత ప్రతిపాదన తెర పైకి తీసుకువచ్చారు.

జగన్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చివరికి న్యాయ పోరాటంతో జగన్ 3 రాజధానుల ప్రతిపాదనకు బ్రేక్ పడింది. అందుకే 2024 ఎన్నికల్లో రాజధాని అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరికి జగన్ రాజధానిగా ప్రతిపాదించిన ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఓట్లు, సీట్లు రాలేదు. అయినా సరే.. ఇప్పటికీ వైసీపీ నేతలు పదే పదే రాజధాని అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారు. గ్రాఫిక్స్ అని, ముంపు ప్రాంతమని, అలల రాజధాని అని అదే దుష్ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అనలిస్టు ముసుగులో కొందరు వైసీపీ నేతలు సాక్షి మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల ఆలోచనకు అద్దం పడుతున్నాయి. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని సాక్షి మీడియాలో అనలిస్టుల ముసుగులో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

Also Read : ద్వారంపూడికి చెక్..? ఫోకస్ పెట్టిన సర్కార్..!

ఒకరోజు జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండాలని ముందే ప్రకటించింది. దీంతో అమరావతిపై జరిగే చర్చకు, అమరావతి చట్టబద్ధత తీర్మానానికి వైసీపీ వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేసేలా.. ఈనాడు పత్రికలో ఓ కార్టూన్ ప్రచురించారు. అమరావతి అనే మొక్క చుట్టూ చట్టబద్ధత అనే రక్షణ కంచె ఏర్పాటు చేశారు. అలాగే ఆ మొక్క కోసం ఆత్రంగా, ఆశగా ఎదురు చూస్తున్న మేక కూడా కార్టూన్‌లో ఉంది. ఈ మేక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ మేక ముఖం జగన్‌ను పోలి ఉన్నట్లు ఉందని.. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేతను కించపరిచేలా కార్టూన్ వేశారని.. వెంటనే ఈనాడు పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఇక సాక్షి పత్రికలో అయితే కార్టూన్ బరితెగింపు అంటూ పెద్ద వార్త కూడా ప్రచురించారు. అయితే సాక్షి మీడియా, వైసీపీ నేతల తీరు గురివింద మాదిరిగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ.. ప్రతిపక్ష హోదా లేనప్పుడు.. తెలుగుదేశం పార్టీ అధినేతపై లెక్క లేనన్ని కార్టూన్లు అటు సాక్షి పత్రికలో, టీవీలో ప్రచురించింది. వీటన్నిటిలో అత్యంత దారుణమైనది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై “నారాసుర రక్త చరిత్ర” అంటూ చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి.. చంద్రబాబు ఇంటి పేరుతోనే నేరుగా తప్పుడు వార్త ప్రచురించింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ స్నాక్స్ ఖర్చు అంటూ తప్పుడు వార్త ప్రచురించింది. వీటన్నిటి కంటే.. చంద్రబాబును వెన్నుపోటు దారుడని, పవన్ కల్యాణ్‌ను దత్త పుత్రుడని, లోకేష్‌ను పప్పు అంటూ కామెంట్ చేస్తూ.. లెక్క లేనన్ని కార్టూన్‌లు వ్యంగ్యంగా ప్రచురించింది సాక్షి. మరి వాటి వల్ల టీడీపీ నేతల మనోభావాలు దెబ్బ తినవా.. అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెప్పాల్సిన జవాబు. వైసీపీ నేతలు, సాక్షి మీడియా తీరు చూస్తే.. “తాము చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం” అన్నట్లుగా ఉంది. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రుజువులతో సహా తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీ నేతలపై ఉంది. మరి ఆ పని సమర్థంగా చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాయుడుపై వేటు.. కొత్తగా...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఒంటిమిట్ట కల్యాణం పౌర్ణమి...

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి...

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో...

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...

చెల్లెలు కోసం అన్నకు...

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా...

శాసససభలో సరే.. మండలిలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన...

ద్వారంపూడికి చెక్..? ఫోకస్...

ఏపీలో కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవుల...

పోల్స్