Saturday, March 28, 2026 08:46 PM
Saturday, March 28, 2026 08:46 PM

చెల్లెలు కోసం అన్నకు షాక్ ఇస్తారా..? గులాబీ పార్టీలో వింత వాతావారణం..!

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా సంచలనంగా మారిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీకి రంగం సిద్దం చేసారు. ఏప్రిల్ 25న మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆమె బీఆర్ఎస్ నాయకులను తన వైపు తిప్పుకోగలరా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. గత సెప్టెంబర్ లో ఆమెను సస్పెండ్ చేసిన తర్వాతి నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కవితగా రాజకీయం నడిచింది.

Also Read : ఇరాన్‌ కు ట్రంప్ భారీ ఊరట.. డెడ్ లైన్ పెంచిన అమెరికా..!

సస్పెండ్ అయిన తర్వాత ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్‌ నాయకులు ఆమె వెంట నడుస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసి జాతీయ రాజకీయాల వైపు వెళ్లడం వల్లే రాష్ట్రంలో బలహీనపడిందని కవిత బాహాటంగా విమర్శిస్తున్నారు. తన కొత్త పార్టీ పూర్తిగా తెలంగాణ సెంట్రిక్ గా ఉంటుందని, ఉద్యమ కాలం నాటి నిజమైన కార్యకర్తలు, నాయకులు తనతోనే ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్‌ లో ప్రాధాన్యత కోల్పోయిన పాత తరం ఉద్యమ నాయకులను, ముఖ్యంగా మహిళా, యువ నాయకత్వాన్ని ఆకర్షించడం ద్వారా బీఆర్ఎస్ పునాదులను కదిలించాలని ఆమె వ్యూహరచన చేస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తన సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు తీరుపై కవిత అసంతృప్తిగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, అసెంబ్లీ బహిష్కరణ వంటి నిర్ణయాల విషయంలో వారిని నేరుగా నిలదీస్తూ, పార్టీని వారు బలహీనపరుస్తున్నారని ఆమె ఆరోపించారు.

Also Read : వైసీపీలో పునర్విభజన భయం..!

ఈ విభేదాల కారణంగా, ప్రస్తుతం బీఆర్ఎస్‌ లో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కవిత వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో తన పార్టీ ప్రభావం బలంగా ఉంటుందని ఆమె ధీమాగా ఉన్నారు. కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ నాయకులు ఎంతవరకు వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని, కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతలను వదిలి కవిత వెంట ఎంతమంది నడుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే.. బీఆర్ఎస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉండటం, పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శాసససభలో సరే.. మండలిలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన...

ద్వారంపూడికి చెక్..? ఫోకస్...

ఏపీలో కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవుల...

వారికి దూరంగా ఉండండి.....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్...

భారతీ సిమెంట్స్ కు...

గత మూడు నాలుగు నెలలుగా ఉత్కంట...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి...

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

పోల్స్