Wednesday, May 13, 2026 01:49 PM
Wednesday, May 13, 2026 01:49 PM

ద్వారంపూడికి చెక్..? ఫోకస్ పెట్టిన సర్కార్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవుల నుంచి ప్రైవేట్ అసోసియేషన్ల వరకు అన్నింటా ప్రక్షాళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో కీలక మార్పులకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా ఆధిపత్యం చలాయించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పక్కన పెట్టి, ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగల కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలని మెజారిటీ మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణాలో భారీ ఆస్తులు..!

గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియలు సాగాయి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. కాకినాడ పోర్ట్ ద్వారా జరిగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ద్వారంపూడి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని కూటమి నేతలు ముందు నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మిల్లర్లు ఇప్పుడు అసోసియేషన్ పగ్గాలను మార్చాలని పట్టుబడుతున్నారు.

తాజాగా జరిగిన అంతర్గత చర్చల్లో కొన్ని కీలక పాయింట్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని ప్రక్షాళన చేస్తోంది. ద్వారంపూడి వంటి వివాదాస్పద వ్యక్తులు అధ్యక్షుడిగా ఉంటే ప్రభుత్వంతో చర్చలు జరపడం కష్టమని మిల్లర్లు భావిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా అసోసియేషన్‌లో మార్పులు జరిగాయి. అక్కడ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి స్థానంలో నున్న రామకృష్ణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఫార్ములాను రాష్ట్ర కమిటీలోనూ వర్తింపజేయాలని చూస్తున్నారు.

Also Read : వైసీపీలో పునర్విభజన భయం..!

రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ ఆధిపత్యానికి ముగింపు పలికేందుకు మిల్లర్లు నూతన నాయకత్వం కోసం పావులు కదుపుతున్నారు.ప్రస్తుత కమిటీ గడువు ముగియకపోయినా, ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ద్వారంపూడిని పదవి నుంచి తప్పించాలనే ప్రతిపాదనను ఒక బలమైన వర్గం తెరపైకి తెచ్చింది. మరోవైపు, ప్రస్తుత అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం.. మిల్లర్లపై అనవసర రాజకీయ ఒత్తిళ్లు పెంచవద్దని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

రామ్ చరణ్ ‘పెద్ది’...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ఆంధ్ర న్యూస్ 9...

మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో...

అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి...

అమరావతి రైతులకు ప్లాట్ల...

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా భూములిచ్చిన...

పోల్స్