Wednesday, May 13, 2026 07:46 PM
Wednesday, May 13, 2026 07:46 PM

కామెడి పీస్ అయిపోతున్న ట్రంప్.. ఇవేం మూడ్ స్వింగ్స్ ప్రెసిడెంట్ సాబ్..?

ఒక దేశాధ్యక్షుడిగా ఒక నిర్ణయం తీసుకుంటే, దాని మీద స్టాండ్ అయి ఉండాలి. లేదంటే కామెడి పీస్ అయిపోతారు. ఆ పదవికి ఉన్న హుందాతనం, గౌరవం గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాను కామెడి పీస్ కావడమే కాకుండా, తన పదవికి ఉన్న గౌరవాన్ని, హుందాతనాన్ని గాల్లో కలిపేసారు. ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంలో ఆయన వైఖరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read : బ్రేకింగ్: ఐటీ రంగంపై ఇరాన్ అటాక్.. వెబ్ సర్వీసెస్ డౌన్..!

ట్రంప్ అనుసరిస్తున్న తీరు, ఆయన ఇస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు అటు మిత్రదేశాలను, ఇటు రాజకీయ విశ్లేషకులను అయోమయంలో పడేస్తున్నాయి. యుద్ధం కంటే ఆయన చేస్తున్న కామెడీ రాజకీయాలే ఇప్పుడు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ట్రంప్ తన వింత ధోరణిని మరోసారి ప్రదర్శించారు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తానని భారీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ, ఆ డెడ్ లైన్ ముగిసే సమయానికి, ఇరాన్‌ తో చర్చలు ఫలించాయని చెబుతూ తన దాడుల ప్రణాళికను ఐదు రోజుల పాటు వాయిదా వేశారు.

ఇరాన్ అగ్రనేతలతో తమ ప్రతినిధులు అద్భుతమైన చర్చలు జరిపారని, ఇరాన్ శాంతిని కోరుకుంటోందని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే, ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని, ఇవన్నీ ట్రంప్ ఆడుతున్న డ్రామాలు అని, కేవలం చమురు ధరలను నియంత్రించేందుకే ఆయన ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ విమర్శించారు. అలాగే యుద్ధం వంటి సీరియస్ సమయంలో కూడా ట్రంప్ తన నోటికి పనిచెబుతున్నారు.

Also Read : మతం మారితే రిజర్వేషన్ రద్దు..!

ఇరాన్‌ పై దాడుల సమాచారాన్ని మిత్రదేశాలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించగా, జపాన్ కంటే సర్‌ ప్రైజ్ దాడుల గురించి ఎవరికి బాగా తెలుసు..? పెరల్ హార్బర్ గురించి మీరు నాకు చెప్పారా..? అంటూ జపాన్ ప్రధాని సనే తకైచీ ముందే కామెడి చేసారు. దీనితో అక్కడ ఉన్న అధికారులు కూడా షాక్ అయ్యారు. అలాగే ఒకవైపు యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెబుతూనే, మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు సిద్ధమని ప్రకటించడం ట్రంప్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. అసలు అమెరికా లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడమా లేక అక్కడ ప్రభుత్వం మార్పు తీసుకురావడమా అన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

సీమకు రాయల్ కళ.....

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా...

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పొదుపు మొదలుపెట్టిన మోడీ.....

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ...

అమరావతి, పోలవరం ఆపాలా..?...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా...

రామ్ చరణ్ ‘పెద్ది’...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

పోల్స్