Wednesday, August 19, 2026 01:57 AM
Wednesday, August 19, 2026 01:57 AM

మతం మారితే రిజర్వేషన్ రద్దు..!

భారత్‌లో విస్తృతంగా జరుగుతున్న మత మార్పిడికి బ్రేకులు వేసే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. మతం మారిన వారు తమ ఎస్సీ కులాల హోదా కోల్పోతారని సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు హోదా ఉండదని సుప్రీం ధర్మాసనం తేల్చేసింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్‌లో కేవలం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీలని.. ఈ మూడు మతాలకు చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారితే.. వెంటనే ఎస్సీ హోదాకు సంబంధించిన అన్ని రకాల రిజర్వేషన్లు కోల్పోతారని తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు, అట్రాసిటీ చట్టం వంటివి ఆగిపోతాయని స్పష్టం చేసింది. దీనిపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.

Also Read : దానంపైనే బీఆర్ఎస్ గురి..? ఎందుకీ రివేంజ్..?

గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పని చేస్తున్న వ్యక్తిపై జరిగిన దాడిపై గతంలో అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్‌గా ఉంటున్నారని.. ఘటన జరిగిన సమయంలో కూడా క్రైస్తవ మత ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావు లేదని.. మతం మారిన వారికి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదని కోర్టు స్పష్టం చేసింది. తహశీల్దార్ జారీ చేసిన ఎస్సీ కులధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ.. మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అంజారియాతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

Also Read : ఆస్ట్రేలియా ఆటగాళ్లను లేపేస్తాం.. ఉగ్ర సంస్థ వార్నింగ్..!

ఇటీవల చాలా మంది క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీలుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వారి వల్ల అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందటం లేదు. అలాగే మతం మారిన తర్వాత కూడా అట్రాసిటీ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారనే విషయం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు దేశంలో పెను సంచలనంగా మారింది. దేశంలో ఓ వైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ తీర్పు ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్